ఆర్ఆర్ఆర్ కు ఫైనాన్స్ ఆయనే

ఆర్ఆర్ఆర్ – రాజమౌళి-ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్ లో ముస్తాబవుతున్న భారీ సినిమా. బాహుబలి, సాహో, సైరా ల తరువాత అత్యంత భారీ తెలుగు సినిమా ఇదే. దాదాపు మూడు నుంచి నాలుగు వందల కోట్ల…

ఆర్ఆర్ఆర్ – రాజమౌళి-ఎన్టీఆర్-రామ్ చరణ్ కాంబినేషన్ లో ముస్తాబవుతున్న భారీ సినిమా. బాహుబలి, సాహో, సైరా ల తరువాత అత్యంత భారీ తెలుగు సినిమా ఇదే. దాదాపు మూడు నుంచి నాలుగు వందల కోట్ల సినిమా. ఇంత భారీ సినిమాకు పెట్టుబడి భారీగానే కావాలి. మరి ఇంత మొత్తాన్ని ఎలా సర్దబాటు చేస్తున్నారు నిర్మాత దానయ్య? ఇదీ ప్రశ్న.

దీనికి సమాధానంగా చాలా విషయాలే వున్నాయి.

బేసిక్ గా ఈ సినిమాకు దానయ్య నిర్మాత అయినా, అన్ని వ్యవహారాలు దర్శకుడు రాజమౌళినే చూసుకుంటున్నారు. దానయ్యకు ఇంత అమౌంట్ అని ఇచ్చేయడమే. మిగిలిన లాభాలు అన్నీ రాజమౌళివే అని అత్యంత విశ్వసనీయ టాలీవుడ్ వర్గాల బోగట్టా. ఈ మేరకు రాజమౌళి నే సినిమాకు ఫైనాన్స్ కూడా తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.

బాహుబలి వన్ కు ఈనాడు రామోజీ ఫైనాన్స్ చేస్తే, బాహుబలి 2 కు మ్యాట్రిక్స్ ప్రసాద్ తక్కువ వడ్డీకి ఫైనాన్స్ చేసారు. ఈసారి కూడా అత్యంత తక్కువ వడ్డీకి ఫైనాన్స్ కోసం ప్రయత్నించారు. బడా ఫైనాన్సియర్ సత్య రంగయ్య రూపాయిన్నర వడ్డీకి ఫైనాన్స్ చేయడానికి సుముఖత చూపించలేదని బోగట్టా.

దాంతో మళ్లీ మ్యాట్రిక్స్ ప్రసాద్ నే ముందుకు వచ్చారు. అయితే ఆయన ఓ కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఫైనాన్స్ రాజమౌళి పేరు మీదనే ఇస్తానని అన్నట్లు దానికి రాజమౌళి ఓకె అన్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు అంగీకారం కుదిరిన తరువాత ఫైనాన్స్ లభించింది. అందువల్ల ప్రాజెక్టు కు నిర్మాత దానయ్యే అయినా, లాభాల్లో మేజర్ షేర్ రాజమౌళి అండ్ కో దే అని తెలుస్తోంది. ఎనాటి అడ్వాన్స్ కో కట్టుబడి సినిమా చేస్తున్నందున, దానయ్య  బ్యానర్ కు పేరు, అలాగే ఫిక్స్ డ్ అమౌంట్ లాభంగా లభిస్తుంది.

ఇప్పుడు సినిమా మార్కెటింగ్ అంతా రాజమౌళి కుమారుడు కార్తీక్ నే చూస్తున్నారు. ఒక్క ఆంధ్ర ఏరియానే 100 కోట్ల రేషియోలో చెబుతున్నారు. దానికి కూడా ఒకో ఏరియాకు ఇద్దరి నుంచి ఆరుగురు పోటీ పడుతుండడం విశేషం.