సినిమాకు ట్రయిలర్ వదలడం అన్నది రెండువిధాలుగా పని చేస్తుంది. ఒకటి ప్రేక్షకులను సినిమాకు దగ్గర చేయడానికి రెండు బయ్యర్లకు ఓ ధీమా ఇవ్వడానికి. ఐరా క్రియేషన్స్ పతాకంపై నిర్మిస్తున్న అశ్వథ్ధామ సినిమా ట్రయిలర్ బయటకు రావడం అన్నది బిజినెస్ కు బాగా హెల్ఫ్ చేసింది. ఇప్పటి దాకా కేవలం డిస్కషన్స్ లో వున్న బిజినెస్ ఒక్క రోజులో ఊపు అందుకుంది.
వైజాగ్, ఈస్ట్, సీడెడ్ ఇలా ఒక్కో ఏరియా కేవలం ఒక్క రోజులో క్లోజ్ చేసారు. అలాగే హిందీ డిజిటల్ (వితవుట్ రీమేక్ రైట్స్) కూడా క్లోజ్ చేసేసారు. ట్రయిలర్ ప్రామిసింగ్ గా వుండడం, రిలీజ్ డేట్ పండగ సినిమాలకు చెప్పుకోదగ్గ దూరంలో వుండడం, పైగా ఆ రోజు సరైన పోటీ అనేది లేకపోవడం కలిసి వచ్చింది.
ఆంధ్ర ను మూడు కోట్ల రేషియోలో క్లోజ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దానిపై కొంత రికవరబుల్ అడ్వాన్స్ లు కూడా తీసుకుని ఎన్ఆర్ఎ చేసినట్లు తెలుస్తోంది. నాగశౌర్య సరసన మెహరీన్ నటించిన ఈ సినిమాను ఉష మాల్పూరి నిర్మించారు.