రాజమౌళి-ఎన్టీఆర్-చరణ్ ల ఆర్ఆర్ఆర్ నుంచి మరో స్టిల్ బయటకు వచ్చింది. దాంతో పాటు రెండు పాటలు మినహా సినిమా అంతా పూర్తయిందని, డబ్బింగ్ కూడా జరిగిపోయిందని అప్ డేట్ ఇచ్చారు.
పనిలో పనికి పోస్టర్ లో కిందన అతి చిన్న అక్షరాలతో 13 అక్టోబర్ 2021 అని డేట్ వేసేసారు. అయితే ఆ డేట్ కు విడుదల వుంటుందా? అన్న సందేహాలు మాత్రం ఇంకా వుండనే వున్నాయి.
సినిమా షూట్ జూలై నెల అంతా వుంటుందని తెలుస్తోంది. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావాల్సి వుంటుంది. అది అసాధ్యమని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. అక్టోబర్ నాటికి అన్నీ పూర్తి చేసుకుని నవంబర్ కు ఫస్ట్ కాపీ రావడానికి అవకాశం వుందని రాజమౌళినే లెక్కలు వేసుకుంటున్నారని యూనిట్ వర్గాల బోగట్టా.
కొత్తగా జనవరి 26 అనే డేట్ వినిపిస్తోంది. దేశభక్తుల సినిమా కాబట్టి ఆ డేట్ పెర్ ఫెక్ట్ గా వుంటుందని, సంక్రాంతిని నమ్ముకున్న భారీ సినిమాలకు అడ్డం పడకుండా వుంటుందని కూడా ఆ డేట్ ను ఎంచుకున్నారని అంటున్నారు.
సినిమా డిజిటల్ హక్కుల కొన్న కొందరి కొసం ఇప్పుడు అర్జెంట్ గా ఈ అప్ డేట్, పోస్టర్ విడుదల చేసారని, అక్టోబర్ కి రావడం అంటే కాస్త కష్టమే అని ఇండస్ట్రీ టాక్.
ఆర్ఆర్ఆర్ అక్టోబర్ కు వచ్చేస్తే మంచిదే, లేదూ అంటే చిరు ఆచార్య, బన్నీ పుష్ప, మహేష్ సర్కారు వారి పాట, పవన్ అయ్యప్పన్ రీమేక్, ఇలా చాలా సినిమాలు ఇబ్బందుల్లో పడతాయి. కానీ అక్టోబర్ లో వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.