ఆర్ఆర్ఆర్. రాజమౌళి-ఎన్టీఆర్-రామ్ చరణ్ ల కాంబినేషన్ లో డివివి దానయ్య నిర్మిస్తున్న భారీ సినిమా. ఈ సినిమా ఖర్చు మూడు నుంచి నాలుగు వందల కోట్ల మేరకు వుంటుందని టాక్.
అసలు ఫిగర్ నిర్మాతకు, దర్శకుడికే తెలియాలి. ఎంత అడ్వాన్స్ లు లాగినా, నాన్ థియేటర్ విక్రయాలు సాగించినా, కనీసం రెండు వందల కోట్లు అయినా ఫైనాన్స్ తెచ్చారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
ఇందులో వంద కోట్లకు కాస్త అటు ఇటుగా వెంకట్రామిరెడ్టి అనే ఫైనాన్సియర్ నుంచి తెచ్చారని, అక్కడ వడ్డీ రెండు రూపాయల లోపే అని ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. ఇక సత్య రంగయ్య, శోభన్ తదితరుల నుంచి మరో వంద కోట్లు లోపు ఫైనాన్స్ తెచ్చారని, దానికి మాత్రం రెండు రూపాయల వడ్డీ వుంటుందని అంటున్నారు.
కరోనా రెండు దశల కారణంగా ఆర్ఆర్ఆర్ చాలా ఆలస్యం అయిపోయింది. ఇందువల్ల వడ్డీ భారం చాలా భారీగా వుంటుందని తెలుస్తోంది. పైగా బాలీవుడ్ లో అనుకున్న టైమ్ కు సినిమా ఇవ్వకపోతే, ఇచ్చిన అడ్వాన్సు లకు వడ్డీలు కట్టాల్సి వుంటుంది.
అందువల్ల ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుకు కేవలం వడ్డీనే వంద కోట్ల వరకు వుంటుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారీ సినిమాకు అన్నీ భారీగానే వుంటాయేమో?