సందట్లో సడేమియా అన్నట్లు వుంది ఆర్ఆర్ఆర్ వ్యవహారం. జనం అంతా తిండి తిప్పలు లేక, పనులు లేక, భయంతో కిందా మీదా అయిపోతుంటే ఆర్ఆర్ఆర్ యూనిట్ మాత్రం టైటిల్, మోషన్ పోస్టర్ ను అందించబోతోంది. ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ అంటే చాలా వినిపించాయి. వాటిలో ఏది ఫైనల్ అవుతుందన్నది ప్రశ్న.
కొద్ది రోజుల క్రితం వరకు యూనిట్ ఒకలా ఆలోచించింది. హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, తెలుగు భాషలకు ఆర్ఆర్ఆర్ అని వచ్చేలా వేరు వేరు టైటిళ్లు పెట్టాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆలోచన మారినట్లు తెలుస్తోంది.
ఆ విధంగా ఆలోచించినపుడు హిందీకి ఆర్ఆర్ఆర్ అని పెట్టి కిందన 'రైజ్..రివోల్ట్..రివెంజ్' అని క్యాప్షన్ పెడదాం అనుకున్నారు. ఇప్పుడు అదే మొత్తం అన్ని భాషలకు పెట్టాలని ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది.
ఉగాది సందర్భంగా దీన్ని ప్రకటించబోతున్నారు. ఇది కాక రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా 27న మళ్లీ మరో అప్ డేట్ ను ఇస్తారు. అది ఏమిటన్నది ఇంకా డిసైడ్ కాలేదు.