ఆర్ఆర్ఆర్..గ్రేట్ ఆంధ్ర ముందే చెప్పింది

మొత్తానికి క్లారిటీ వచ్చింది. ఆర్ఆర్ఆర్ విడుదల డేట్ 8 జనవరి 2021 అని అనౌన్స్ మెంట్ అఫీషియల్ గా బయటకు వచ్చింది. నిజానికి ఆర్ఆర్ఆర్ సమ్మర్ కు రావడం లేదని కొన్ని నెలల క్రితమే…

మొత్తానికి క్లారిటీ వచ్చింది. ఆర్ఆర్ఆర్ విడుదల డేట్ 8 జనవరి 2021 అని అనౌన్స్ మెంట్ అఫీషియల్ గా బయటకు వచ్చింది. నిజానికి ఆర్ఆర్ఆర్ సమ్మర్ కు రావడం లేదని కొన్ని నెలల క్రితమే గ్రేట్ ఆంధ్ర ఎక్స్ క్లూజివ్ గా వెల్లడించింది. కానీ అప్పటి నుంచి ఆర్ఆర్ఆర్ నుంచి ఎటువంటి క్లారిటీ లేదు. ఇదిలా వుంటే సరిగ్గా వారం క్రితం జనవరి 29 ఆర్ఆర్ఆర్ అసలు 2020 రావడం లేదని 2021 సంక్రాంతికే వస్తుందని మళ్లీ మరోసారి ఎక్స్ క్లూజివ్ గావెల్లడించాం

https://telugu.greatandhra.com/movies/movie-gossip/exclusive-rrr2021-pongal-ke-105299.html

ఇప్పుడు అదే నిజమైంది. అధికారికంగా ప్రకటన వచ్చింది. ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాకు అయితే సమ్మర్ లేదా సంక్రాంతి తప్ప, దసరా సీజన్ సరిపోదు. ఈసారి సంక్రాంతికి తెలుగు సినిమాలు దాదాపు అయిదారు వందల కోట్ల గ్రాస్ కలెక్షన్లు కళ్ల చూసాయి. ఆర్ఆర్ఆర్ సుమారు 400 కోట్ల బడ్జెట్ తో తయారవుతోంది,.

అందువల్ల అంతకు అంతా రికవరీ కావాలంటే సంక్రాంతినే బెటర్ అని నిర్మాత దానయ్య భావించారు.రాజమౌళి ముందు ఓకె అనలేదు. కానీ దానయ్య గట్టిగా పట్టుపట్టడంతో సంక్రాంతి విడుదలకు సరే అనక తప్పలేదు. ఎన్టీఆర్, రామ్ చరణ్, అజయ్ దేవగన్, ఆలియాభట్ లాంటి భారీ తారాగణం తో కూడిన ఈ సినిమా సంక్రాంతి 2021 మీద రుమాలు వేసింది. ఇక ఆ దరిదాపుల్లో మరో సినిమాను ఎవ్వరూ ప్లాన్ చేయరు కాక చేయరు.