ఎక్స్ క్లూజివ్-ఆర్ఆర్ఆర్ 2021 సంక్రాంతికే ?

కొన్ని నెలల క్రితం గ్రేట్ ఆంధ్ర ఎక్స్ క్లూజివ్ గా వెల్లడించింది ఆర్ఆర్ఆర్ సినిమా అనుకున్నట్లుగా పని జరగడం లేదని, అనుకున్న డేట్ కు విడుదల కాదని, దసరాకు వచ్చే అవకాశం వుందని. అప్పట్లో…

కొన్ని నెలల క్రితం గ్రేట్ ఆంధ్ర ఎక్స్ క్లూజివ్ గా వెల్లడించింది ఆర్ఆర్ఆర్ సినిమా అనుకున్నట్లుగా పని జరగడం లేదని, అనుకున్న డేట్ కు విడుదల కాదని, దసరాకు వచ్చే అవకాశం వుందని. అప్పట్లో ఇది గాలి వార్త అని చాలా మంది కొట్టిపాడేసారు. కానీ ఇటీవల కొంతకాలంగా ఆర్ఆర్ఆర్ దసరాకే వస్తుందని కొత్తగా వినిపించడం ప్రారంభించారు. ఇటీవలే హీరోయిన్  ఆలియా భట్, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ షూట్ లో పాల్గొంటున్నారు.

ఇప్పుడు లేటెస్ట్ గా, విశ్వసనీయంగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ ఈ ఏడాది దసరాకు కూడా రాకపోవచ్చు. 2021 సంక్రాంతి కే వస్తుంది. దీనికి రెండు కారణాలు. పని వత్తిడి ఒక కారణం. అంత భారీ బడ్జెట్ సినిమా దసరాకు వస్తే వర్క్ అవుట్ కాదన్న అనుమానం.

ప్రస్తుతానికి తెలుగు సినిమాలకు రెండే సీజన్లు మిగిలాయి. సంక్రాంతి, సమ్మర్. ఇది కాక దసరా అన్నది కొంత వరకు మాత్రమే వర్కవుట్ అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో కొరటాల శివ-మెగాస్టార్ చిరు-రామ్ చరణ్ ల మల్టీ స్టారర్ అక్టోబర్ విడుదల దిశగా చకచకా రెడీ అవుతోంది. డే అండ్ నైట్ ఈ సినిమా షూట్ ను చకచకా చేస్తున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ లేదా కొరటాల శివ సినిమా ఈ రెండింటిలో ఒకటే దసరాకు వస్తుంది. రెండవది 2021 సంక్రాంతికి వెళ్లాల్సిందే.

బడ్జెట్ రీత్యా కొరటాల-మెగాస్టార్ సినిమాకు దసరా సరిపోతుంది కానీ, ఆర్ఆర్ఆర్ కు మాత్రం దసరా సరిపోకపోవచ్చు. ఈసారి సంక్రాంతికి అన్ని సినిమాలకు కలిపి తెలుగు రాష్ట్రాల్లోనే 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఆ మేరకు వస్తే తప్ప ఆర్ఆర్ఆర్ కు సరిపోదు. అందువల్ల 2021 సంక్రాంతికే రావాలని, దసరా డేట్ ను కొరటాల-మెగాస్టార్ సినిమాకు వదిలేయాలని ఆర్ఆర్ఆర్ కు అన్నీ తానై వ్యవహరిస్తున్న రాజమౌళి నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఎందుకీ గొడవ..ఎందుకీ తలనొప్పి