ఇక్కడ సాయిపల్లవి బజ్ తగ్గింది. కానీ కోలీవుడ్ లో మాత్రం ఆమెపై సరికొత్త పుకారు పుట్టుకొస్తోంది. దర్శకుడు ఏఎల్ విజయ్, సాయిపల్లవి ప్రేమించుకుంటున్నారట. త్వరలోనే వీళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకుంటారనేది కోలీవుడ్ లో వినిపిస్తున్న హాట్ గాసిప్.
తెలుగు, తమిళ భాషల్లో కణం అనే సినిమా చేసింది సాయిపల్లవి. ఆ సినిమా దర్శకుడే ఈ ఏఎల్ విజయ్. నిజానికి ఆ సినిమా టైమ్ లోనే వీళ్లిద్దరి మధ్య ఏదో నడుస్తోందంటూ పుకార్లు వినిపిస్తాయి. అదంతా గతం. కానీ ఇప్పుడు ఫ్రెష్ గా మరోసారి వీళ్ల ఎఫైర్ పై కథనాలు రావడం విశేషం.
గతంలో హీరోయిన్ అమలాపాల్ ను పెళ్లి చేసుకున్నాడు విజయ్. కానీ వాళ్ల ప్రేమ వివాహం ఎక్కువ రోజులు సాగలేదు. కుటుంబపరమైన ఇబ్బందుల వల్ల విజయ్ కు విడాకులిచ్చింది అమలాపాల్. అలా అమలాపాల్ కు దూరమైన తర్వాత సాయిపల్లవికి దగ్గరయ్యాడట విజయ్.
ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే.. తను జీవితంలో పెళ్లి చేసుకోనని ప్రకటించింది సాయిపల్లవి. తన తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకుంటానని, పెళ్లి అనే ఆలోచన చేయనని తెలిపింది. అలాంటి సాయిపల్లవిపై ఇలాంటి పుకార్లు రావడం నిజంగా విచిత్రం.