Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సాహో... ఆ సీన్ హైలెట్

సాహో... ఆ సీన్ హైలెట్

ఒక్కో సినిమాలో ఒక్కో సీన్ కీలకంగా వుంటుంది. ఫ్యాన్స్ ఫిదా అయిపోయేలా వుంటుంది. అది ఏ హీరో అయినా సరే. వాస్తవానికి ఇలాంటి సీన్ లు వుండేలా పెద్ద సినిమాల డైరక్టర్లు జాగ్రత్త తీసుకుంటారు కూడా. బాహుబలి ప్రభాస్ రాబోయే భారీ సినిమా సాహో సినిమాలో కూడా అలాంటి సీన్ ఒకటి వుందని తెలుస్తోంది. యమదొంగలో ఎన్టీఆర్ 'ఎనీ డౌట్స్' అని గద్దించే సీన్ అయినా, శ్రీమంతుడులో దత్తత గురించి మహేష్ చెప్పే సీన్ అయినా, ఇలా ప్రతి హీరోకి ఓ సీన్ వుంటుంది.

సాహో సినిమాలో కూడా అలాంటి సీన్ ఒకటి వుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. సాహో సినిమాలో క్లయిమాక్స్ దగ్గర చేసి ఓ సీన్ వుంటుంది. హీరో ప్రభాస్ చిత్రంగా ముందుకు కదిలి, సింహాసనం లాంటి కుర్చీలో కూర్చునే సీన్ అది. ఇందుకోసం ప్రత్యేకమైన, సింహాసనాన్ని తలపించే అందమైన కుర్చీ ఒకటి తయారుచేసారని తెలుస్తోంది.

ప్రభాస్, ఆ సీన్ లో డైలాగ్ చెప్పి, కుర్చీలో దర్జాగా కూర్చునే సీన్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతారని ఇన్ సైడ్ వర్గాల టాక్. సాహో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కావస్తోంది. మరోవారం పదిరోజుల్లో సెన్సారుకు వెళ్లిపోతుంది. ఇక రాను రాను సాహో విశేషాలు, సంగతులు మరిన్ని వినిపించడం ప్రారంభిస్తాయి. 

విపరీత పోకడలకు మోడీ సర్కార్ చెక్ పెడుతోంది

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?