సాహో.. ఇది కూడా పెద్ద సినిమానే

సాహో… బడ్జెట్ పరంగా ఇది చాలా పెద్ద సినిమా. కేవలం బడ్జెట్ పరంగానే కాదు, రన్ టైమ్ విషయంలో కూడా ఇది పెద్ద సినిమానే. అవును.. క్రెడిట్ టైటిల్స్, నో స్మోకింగ్ యాడ్స్ తో…

సాహో… బడ్జెట్ పరంగా ఇది చాలా పెద్ద సినిమా. కేవలం బడ్జెట్ పరంగానే కాదు, రన్ టైమ్ విషయంలో కూడా ఇది పెద్ద సినిమానే. అవును.. క్రెడిట్ టైటిల్స్, నో స్మోకింగ్ యాడ్స్ తో కలుపుకుంటే సాహో సినిమా అటుఇటుగా 3 గంటల నిడివి ఉంది. ఇదే రన్ టైమ్ తో సెన్సార్ కు పంపించాలా లేక ఇంకాస్త ట్రిమ్ చేద్దామా అనే ఆలోచనలో ఉంది యూనిట్.

మేకింగ్ లోనే కాదు, రన్ టైమ్ విషయంలో కూడా తెలుగు మూవీ మేకర్స్ ఇప్పుడు చాలా ఫ్రీడమ్ తీసుకుంటున్నారు. అర్జున్ రెడ్డి, రంగస్థలం, మహానటి లాంటి సినిమాల సక్సెస్ తో రన్ టైమ్ గురించి పెద్దగా ఎవ్వరూ ఆలోచించడం లేదు. రెండున్నర గంటలకే సినిమాను ముగించాలనే నియమం పెట్టుకోవడం లేదు. ఇప్పుడు సాహో కూడా అదే బాటలో ఉంది. ఈ సినిమా ఫైనల్ వెర్షన్ అక్షరాలా 2 గంటల 52 నిమిషాలు ఉంది.

సినిమా చూసిన చాలామంది ఇదే రన్ టైమ్ తో రిలీజ్ చేయాలని సూచించారట. మేకర్స్ మాత్రం మరికొంతమంది సూచనలు, సలహాలు తీసుకోవాలని భావిస్తున్నారు. ఈ 2 గంటల 52 నిమిషాల్లో గంటన్నర నిడివి పూర్తిగా యాక్షన్ సన్నివేశాలున్నాయంటే.. సాహోను ఏ రేంజ్ లో తెరకెక్కించారో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు, సినిమాను కేవలం 3 పాటలకే (మాంటేజ్ సాంగ్ మినహా) కుదించడానికి కారణం కూడా ఈ రన్ టైమ్.

అయితే ఎక్కువ మంది మాత్రం సినిమాను మరో 7-8 నిమిషాలు కుదిస్తే బాగుంటుందని ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. ఈరోజు లేదా రేపటిలోగా రన్ టైమ్ పై ఓ నిర్ణయం తీసుకుంటారు. మరోవైపు సినిమా ప్రమోషన్ లో భాగంగా మిగిలిన ఆ మూడో పాటను కూడా త్వరలోనే విడుదల చేసి, దేశవ్యాప్తంగా టూర్ ప్రారంభించాలని అనుకుంటున్నారు. 

సీమ టీడీపీ నేతలు.. సద్దు చేయడం లేదు!