ప్రభాస్ నటిస్తున్న సాహో సినిమా లెక్కప్రకారం ఈ ఏడాదిలోనే విడుదలకావాలి. పాత అప్ డేట్స్ ప్రకారం చూసుకుంటే ఈ సమ్మర్ కే రావాలి. కానీ ప్రజెంట్ అప్ డేట్స్ ప్రకారం చూసుకుంటే ఈ వేసవికి వచ్చేది అసంభవం. దీంతో ఈ సినిమా కనీసం దసరా లేదా దీపావళికైనా రిలీజ్ అవుతుందని అంతా ఎదురుచూస్తున్నారు.
కానీ సాహో సినిమా వచ్చే ఏడాదికి పోస్ట్ పోన్ అయినట్టు తెలుస్తోంది. 2019సంక్రాంతికే ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందట. ఈ నిర్ణయం వెనక ప్రధాన కారణం షూటింగ్ లో జాప్యం. ఇప్పటికే స్టార్ట్ కావాల్సిన దుబాయ్ షెడ్యూల్ ఇంకా షురూ కాలేదు. ఈ నెలాఖరుకి లేదా వచ్చే నెల మొదటి వారంలో దుబాయ్ షెడ్యూల్ ఉంటుంది.
ఆ తర్వాత రొమేనియా షెడ్యూల్ ఉంటుంది. దుబాయ్ షెడ్యూల్ దాదాపు నెల రోజులు ప్లాన్ చేశారు. ఆ తర్వాత రొమేనియా షెడ్యూల్ కూడా మరో నెల రోజులు ఉంటుంది. గ్యాప్ తో పాటు లెక్కేసుకుంటే ఈ రెండు షెడ్యూల్స్ కే దాదాపు 3నెలల టైం అయిపోతుంది.
పైగా పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ కు కనీసం 3నెలలు టైం తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు దర్శకుడు సుజీత్. అందుకే సాహోను వచ్చే ఏడాది సంక్రాంతికి ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సో.. ఈ ఏడాది ప్రభాస్ నుంచి సినిమా లేనట్టే.