వైఎస్ఆర్ బయోపిక్ ఇటీవలే తెరపైకి వచ్చింది. డైరక్టర్ మహి దర్శకత్వం వహించే ఈ సినిమాకు స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అయితే వైఎస్ఆర్ క్యారెక్టర్ కు ఎవరు సూట్ అవుతారు అన్నది సమస్య. మమ్ముట్టి, నాగార్జున వంటి పేర్లు ఇప్పటికే వినిపించాయి. ఇంకా కన్నడ, తమిళ, హిందీ నటులను అనేకమందిని పరిశీలిస్తున్నారు. కానీ వీలయినంత వరకు ఫెమిలియర్ నటుడు వైఎస్ఆర్ పాత్ర పోషిస్తేనే సినిమాకు బజ్ వస్తుంది.
వైఎస్ఆర్ మీద తీయబోయే సినిమా పూర్తగా బయోపిక్ కాదు. అంటే పుట్టిన దగ్గర నుంచి మరణం వరకు వుండదు. ఆయన లైఫ్ లోని కీలక ఫేజ్ మాత్రమే సినిమాగా తెరకెక్కిస్తారు. వైఎస్ఆర్ గా నాగార్జున అయితే ఎలా వుంటుంది? అన్న ఆలోచన నిర్మాతలకు వుంది. అయితే నాగార్జునను సన్నిహితుల ద్వారా కదిలిస్తే, ఒకటే కండిషన్ అన్నాడని తెలుస్తోంది.
వైఎస్ఆర్ పాత్ర ఆనందంగా పోషిస్తాను కానీ, 2019జనరల్ ఎన్నికల ముందు అయితే చేయను అని చెప్పేసాడట. సినిమా ఎన్నికల ముందు రెడీ చేస్తామంటే తాను చేయనని, ఎన్నికల తరువాత అయితే చేయడానికి రెడీ అని నాగ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా ఎన్నికల ముందు వైఎస్ పాత్ర చేస్తే, లేనిపోని గుసగుసలకు అపార్థాలకు దారి తీస్తుందని నాగ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.