ఆపిల్ కొంపముంచిన ‘ఎక్స్’

విప్లవాత్మక మార్పుగా చెప్పుకొచ్చారు. అందరికీ ఎంతో ఇష్టమైన హోం బటన్ ను తొలిగించారు. ఎన్నో అదనపు ఫీచర్లు పెట్టారు కానీ రిజల్ట్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఆపిల్ ఎక్స్-సిరీస్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి.…

విప్లవాత్మక మార్పుగా చెప్పుకొచ్చారు. అందరికీ ఎంతో ఇష్టమైన హోం బటన్ ను తొలిగించారు. ఎన్నో అదనపు ఫీచర్లు పెట్టారు కానీ రిజల్ట్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. ఆపిల్ ఎక్స్-సిరీస్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి.

నూతన సంవత్సరం మొదటి 3నెలల్లో 40మిలియన్ మొబైల్స్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది యాపిల్. అయితే అంతలోనే తన లక్ష్యాన్ని సగానికి సగం కుదించుకుంది. 20మిలియన్ల యూనిట్లు ఉత్పత్తి చేస్తే సరిపోతుందని అంతర్గతంగా సందేశాలు పంపించింది. దీనికి ప్రధాన కారణం ఎక్స్-సిరీస్ అమ్మకాలు గణనీయంగా పడిపోవడమే.

మిగతా సిరీస్ ఐపోన్స్ తో పోలిస్తే ఎక్స్-సిరీస్ లో ఫీచర్లు చాలా అధికం. సెక్యూరిటీ ఫీచర్లు కూడా పుష్కలం. కానీ ఐ-ఫోన్ వినియోగదారులకు ఎంతో ఇష్టమైన హోమ్ బటన్ ఇందులో లేదు. మరీ ముఖ్యంగా ధర కూడా లక్ష రూపాయలపైనే. అందుకే చైనా, ఇండియాతో పాటు యూరోప్ లోని చాలా దేశాల్లో ఐఫోన్-ఎక్స్ అమ్మకాలు పడిపోయాయి.

ఆపిల్ వర్గాలు మాత్రం దీనికి భిన్నమైన వాదన వినిపిస్తున్నాయి. క్రిస్మస్ సీజన్ ముగిసిన తర్వాత సాధారణంగా అమ్మకాలు తగ్గడం సహజమని అంటోంది. కానీ సగానికి సగం ఉత్పత్తి పడిపోయేలా ఎప్పుడూ అమ్మకాలు తగ్గలేదనేది వాస్తవం. ఏదేమైనా ఎక్స్-సిరీస్ పై 'యాపిల్' లో అంతర్గతంగా చర్చ మాత్రం ఊపందుకుంది.