మొదటి సినిమాలో కమర్షియల్ అంశాలకి దూరంగా… ఒక ప్రయోగం లాంటిది చేసిన వరుణ్‌తేజ్ ఫ్లాప్‌తో కెరీర్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ‘ముకుంద’ చిత్రానికి వచ్చిన ఓపెనింగ్స్‌ని బట్టి అతను కమర్షియల్ సినిమా చేసినట్టయితే మొదటి చిత్రంతోనే సక్సెస్ వరించి ఉండేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.
‘ముకుంద’ విడుదలకి ముందు కమర్షియల్ చిత్రాలకి దూరంగా, కొత్త రకం చిత్రాలతో తన కెరీర్ బిల్డ్ చేసుకోవాలని అనుకున్నాడు వరుణ్ తేజ్. అందుకే రెండో సినిమా క్రిష్ డైరెక్షన్‌లో చేస్తున్నట్టు చెప్పాడు. కానీ ముకుంద రిజల్ట్‌తో ఇప్పట్లో రిస్క్ తీసుకోరాదని డిసైడయ్యాడు. రిస్క్ చేసి ఫ్లాప్ కొని తెచ్చుకోడం కంటే సేఫ్ గేమ్ ఆడడం సబబని తెలుసుకున్నాడు.
వరుణ్‌తేజ్ రెండో సినిమాని పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేయబోతున్నాడు. రెండో సినిమా పూరితో చేయాలా లేక వేరే డైరెక్టర్‌తోనా అని ఆలోచనలో పడ్డ మెగా క్యాంప్ ఫైనల్‌గా పూరినే బెస్ట్ అని ఫిక్స్ అయింది. వరుణ్‌తేజ్ రెండో సినిమాని తానే డైరెక్ట్ చేస్తున్నట్టు పూరి కన్‌ఫర్మ్ చేసాడు. వరుణ్‌తేజ్ మొదటి సినిమానే పూరి డైరెక్ట్ చేయాల్సింది. కానీ అది మెటీరియలైజ్ కాకపోవడంతో వరుణ్ ముకుంద చేసాడు.