సాహోలో ‘అదే’ అట్రాక్షన్

బాహుబలి ప్రభాస్ సాహో సినిమా ట్రయిలర్ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు సాహో గురించి తెలిసింది గోరంతే. రేసీ యాక్షన్ జోనర్ అని మాత్రమే తెలుసు. అయితే సినిమా…

బాహుబలి ప్రభాస్ సాహో సినిమా ట్రయిలర్ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి వరకు సాహో గురించి తెలిసింది గోరంతే. రేసీ యాక్షన్ జోనర్ అని మాత్రమే తెలుసు. అయితే సినిమా ఎలా వుండబోతోంది, దర్శకుడు సుజిత్ ఏం చెప్పబోతున్నాడు.. చూపించబోతున్నాడు అన్న క్యూరియాసిటీ అయితే ప్రభాస్ అభిమానుల్లో వుంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రన్ రాజా రన్ టైపు సినిమాను లార్జ్ స్కేల్ లో, భారీగా చూస్తే ఎలా వుంటుందో, సాహో కూడా అలా వుండబోతోందని తెలుస్తోంది. ఎత్తులు పై ఎత్తులు, రేస్ లు, యాక్షన్ ఎపిసోడ్ లు యాడెడ్ అట్రాక్షన్ అంట. చివరకు వెళ్లేసరికి సాహో కూడా ఫాదర్ కోసం రివెంజ్ తీర్చుకోవడం లాంటి పాయింట్ తోనే వుంటుందని వినిపిస్తోంది.

ఇవన్నీ మించి సినిమాలో ఓ అట్రాక్షన్ వుంటుందని తెలుస్తోంది. 'జెట్ ప్యాక్' లాంటి పరికరం సాయంతో హీరో అనుకున్నపుడల్లా గాల్లోకి ఎగిరి, విన్యాసాలు చేసే సీన్లు వుంటాయని, అవి చాలా బాగా అలరిస్తాయని తెలుస్తోంది. ఆ జెట్ ప్యాక్ సీన్లు అందరినీ ఆకట్టుకునేలా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. 10న ట్రయిలర్ వస్తే, సాహో అట్రాక్షన్లు అన్నీ పూర్తిగా తెలుస్తాయి. 

అధికారంతో వైఎస్సార్సీపీ, ఆరాటంతో బీజేపీ