ప్రభాస్ అభిమానులు ఇప్పుడు ఫుల్ హ్యాపీ. ఇన్నాళ్లూ..సోషల్ మీడియాలో 'అన్నా ఓ స్టిల్ అన్నా, అన్నా ఓ లుక్ అన్నా' అంటూ తెగ ప్రాధేయపడ్డారు. వాళ్ల కోరిక మన్నించి యువి క్రియేషన్స్ ఏకంగా సాహో టీజర్ లాంటి మేకింగ్ వీడియోను విడుదల చేసింది. విదేశాల్లో కోట్లకు కోట్లు ఖర్చు చేసి తీసిన ఫైట్ ఎపిసోడ్ తాలూకా మేకింగ్ వీడియో ఇది.
సాహో సినిమా గురించి ఇన్నాళ్లు అనేక కథలు వినిపించాయి. ఇంత ఖర్చు, అంత ఖర్చు అని. అది ఇప్పుడు తొలిసారి స్క్రీన్ మీద కనిపించింది. హాలీవుడ్ టెక్నీషియన్ల వర్క్ క్వాలిటీ తెలుస్తోంది. సినిమాలో జస్ట్ ఓ ఫైట్ ను ఇంత భారీగా ఈ రేంజ్ లో తీయడం అంటే నిజంగా కాస్త ఆశ్చర్యమే.
అంత ఆశ్చర్యం ఎందుకు అంటే ఇక్కడ డైరక్టర్ రాజమౌళి కాదు. ఒక్క సినిమా అనుభవం వున్న సుజిత్. ఇన్నాళ్లు సుజిత్ ఎలా చేస్తాడో అన్నదే ఒక్క అనుమానం వుండేది. ఇప్పుడు ఆ అనుమానం పూర్తిగా పటాపంచలైపోయింది.
ప్రభాస్ చాలా స్టయిలిష్ గా, పెర్ ఫెక్ట్ ఫిజిక్ తో కనిపించాడు. మేకింగ్ వీడియో కట్, టెక్నికల్ వర్క్, బ్యాక్ గ్రవుండ్ స్కోర్ అన్నీ హాలీవుడ్ రేంజ్ లో వున్నాయి. టోటల్ బాహుబలి ప్రభాస్ బర్త్ డే కు సరైన గిఫ్ట్.