ప్రభాస్ అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ లో వచ్చే ప్రభాస్ పుట్టినరోజు కోసం. ప్రభాస్ లేటెస్ట్ భారీ మూవీ సాహోకు సంబంధించిన అప్ డేట్ లేదా టీజర్ లాంటివి వస్తాయని. కానీ వారి ఆశలు అడియాసలే అనుకోవాలేమో? ఎందుకంటే సాహో వ్యవహారం ఇంకా చాలా వుంది.
మూడు నాలుగు ఫైట్లు ఇంకా చిత్రీకరించాల్సి వుంది. సినిమా విడుదల వచ్చే ఏడాది సమ్మర్ కో, ఆ తరువాతో. మరి అలాంటి నేపథ్యంలో ఇప్పడు టీజర్ లాంటి వ్యవహారాలు ఎందుకు వుంటాయి?
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈసారి ప్రభాస్ పుట్టిన రోజుకు ఓ స్టిల్ మాత్రమే విడుదల చేస్తారు. అంతకు మించి మరేమీ వుండవు. టీజర్ లాంటి కీలక వ్యవహారాలు అసలే వుండవు. ఫ్యాన్స్ మాత్రం సోషల్ నెట్ వర్క్ సైట్లలో టీజర్ విడుదల చేయాలంటూ తెగ హడావుడి చేస్తున్నారు.
కానీ ఎప్పుడో ఏడెనిమిది నెలల తరువాత విడుదల కాబోయే సినిమాకు ఇప్పుడు టీజర్ విడుదల చేయడం సరైనది కాదని, సాహో టీమ్ అభిప్రాయ పడుతోంది.
అందుకే ఈసారి ప్రభాస్ బర్త్ డే కు జస్ట్ స్టిల్ తో సరిపెడతారు.