సాయి ధరమ్ తేజ్ సిక్?

సోలో బతుకే సో బెటరూ టోటల్ నెగిటివ్ రైట్స్ జీ ఫైవ్/జీటీవీ/జీ ఫ్లెక్స్ కు ఇచ్చేసి ప్రశాంతంగా వున్నారు నిర్మాత బోగవిల్లి ప్రసాద్.  మంచి రేటు, మంచి లాభాలు. ఫుల్ హ్యాపీ. కానీ ఇప్పుడు…

సోలో బతుకే సో బెటరూ టోటల్ నెగిటివ్ రైట్స్ జీ ఫైవ్/జీటీవీ/జీ ఫ్లెక్స్ కు ఇచ్చేసి ప్రశాంతంగా వున్నారు నిర్మాత బోగవిల్లి ప్రసాద్.  మంచి రేటు, మంచి లాభాలు. ఫుల్ హ్యాపీ. కానీ ఇప్పుడు అనుకోని సమస్య వచ్చి పడింది. అక్టోబర్ 1 నాటికే ఫస్ట్ కాపీ రెడీ చేసి ఇవ్వాల్సి వుంది. కానీ ఇప్పుడు అలా జరగలేదు. 

హీరో సాయి ధరమ్ తేజ్ డబ్బింగ్ పార్ట్ వుండిపోయినట్లు తెలుస్తోంది. అలాగే కొంచెం షూట్ పార్ట్ కూడా. సాయి ధరమ్ తేజ్ చిన్న అనారోగ్య సమస్యతో వున్నారని, బయటకు రాకుండా తన ఇంట్లోనే వుండిపోయారని తెలుస్తోంది.

సమస్య ఇదీ అని తెలియడం లేదు. గ్యాసిప్ లు అయితే కరోనా పాజిటివ్ అని వున్నాయి. నిజానిజాలు తెలియవు. మొత్తానికి ఆయన బయటకు రావడం లేదని బోగట్టా. 

దీంతో ఇప్పుడు ప్రాజెక్టు వర్క్ ఆగిపోయింది. ఒక పక్క జీ సంస్థ నుంచి ప్రెజర్ వస్తోందని తెలుస్తోంది. విషయం వివరించి కొంచెం టైమ్ తీసుకునే పనిలో వున్నారు నిర్మాత అని బోగట్టా. 

వైసీపీ ఎమ్మెల్యేలపై తీవ్ర అసంతృప్తి