Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

‘శైలజరెడ్డి’ హ్యాండిచ్చింది

‘శైలజరెడ్డి’ హ్యాండిచ్చింది

పాపం, ఐడ్రీమ్ వాసుదేవరెడ్డి ఆశలు నెరవేరలేదు. డైరక్టర్ మారుతి సహకారంతో శైలజరెడ్డి అల్లుడు ఓవర్ సీస్ హక్కులు తీసుకోవాలని అనుకుంటే అది వేరే విధంగా టర్న్ తీసుకుంది. గతంలో అజ్ఞాతవాసి సినిమా కొని 11కోట్లు నష్టపోయిన ఎల్ ఎ తెలుగు మూవీస్ సంస్థకే శైలజరెడ్డి అల్లుడు సినిమా శాటిలైట్ హక్కులు కూడా ఇచ్చేసారు.

ఇప్పటికే ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లోని అరవింద సమేత సినిమా హక్కులు అదే సంస్థకు ఇచ్చేసారు. వాస్తవానికి ఒక ఏరియా ఒక బయ్యర్ అన్నది హారిక హాసిని పాలసీ. బయ్యర్ తో తేడావస్తే తప్ప మార్చకూడదని ఆ సంస్థ పాలసీ పెట్టుకుంది. అందుకే ప్రస్తుతం ఆ సంస్థలో తయారవుతున్న ఎన్టీఆర్, నాగచైతన్య, శర్వానంద్ సినిమాలు మూడూ ఒకరికే ఇస్తామని ముందు నుంచి చెబుతోంది.

అయితే మధ్యలో డైరక్టర్ మారుతి ద్వారా ఐడ్రీమ్ వాసుదేవరెడ్డి ఎంటర్ అయ్యారు. తనకు శైలజరెడ్డి అల్లుడు హక్కులు మాత్రం కావాలని ప్రయత్నించారు. మరి ఆదిలోనే నో చెప్పకుండా ఎందుకు సాగించారో కానీ బేరసారాలు సాగించారు. 3.15 కోట్లకు రేటు ఫిక్సయింది. కానీ ఓకె చేయకుండా దాదాపు కాస్త తక్కువగా అదే రేటుకు ఎల్ ఎ తెలుగు కంపెనీకే ఇచ్చేసారు. అదే కాకుండా సుధీర్ వర్మ-శర్వానంద్ సినిమాను కూడా వాళ్లకే ఫిక్స్ చేసారు. కానీ దానికి ఇంకా రేటు కట్టలేదు

ఇదిలా వుంటే ఐడ్రీమ్ వాసుదేవరెడ్డితో సంబంధాలు చెడకుండా వుండడానికి, ఆయనకు అరవింద సమేత, శైలజరెడ్డి అల్లుడు, శర్వానంద్ సినిమాల్లో ఎంత షేర్ కావాలంటే అంత షేర్ ఇప్పిస్తామని, ఎల్ ఎ తెలుగుతో ఆ సినిమాల ప్యాకేజ్ లో భాగస్వామిగా వుండమని హారిక హాసిని జనాలు కోరారు. కానీ దానికి ఆయన నిరాకరించినట్లు బోగట్టా. తను కేవలం ఈ రెండు మీడియం సినిమాల్లో వాటాదారుగా వుంటానని, అరవింద సమేత లాంటి భారీ సినిమాలో వుండలేనని చెప్పినట్లు తెలుస్తోంది.

కానీ తీసుకుంటూ మూడింటిలో భాగస్వామ్యం తీసుకోవాలని, లేదంటే లేదని చెప్పినట్లు వినికిడి. మొదటి నుంచి ఒకరే బయ్యర్ అన్న కాన్సెప్ట్ వుంటే, మరి తనను ఎందుకు ఎంటర్ టైన్ చేసారని, రేటు బేరాలు ఎందుకు సాగించారని వాసుదేవరెడ్డి ఫీలవుతున్నట్లు తెలుస్తోంది. కేవలం తనను అడ్డంపెట్టుకుని, శైలజరెడ్డి అల్లుడు సినిమాకు మూడు కోట్లకు పైగా రేటు తీసుకువచ్చారని, అందుకు తనను వాడుకున్నారని ఆయన ఫీలవుతున్నట్లు ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

మరోపక్కన ఆ సినిమా డైరక్టర్ మారుతి కూడా బ్యానర్ లో తనమాట చెల్లలేదని పీలవుతున్నట్లు తెలుస్తోంది. తనుకోరి, ఐడ్రీమ్ వాసుకి ఓవర్ సీస్ రైట్స్ అడిగితే, అంతాచేసి, చివరిలో ఇలా చేసారని ఆయన ఫీలవుతున్నారని తెలుస్తోంది.

మొత్తంమీద హారిక హాసిని చాలా తెలివిగా నాగచైతన్య-మారుతి సినిమాకు మూడుకోట్లకు పైగా రేటు సాధించింది. ఇప్పుడు ఈ సినిమా ఓవర్ సీస్ లో కచ్చితంగా వన్ మిలియన్ చేయాలి. అప్పుడే బ్రేక్ ఈవెన్ అవుతుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?