సమంత కొత్త ప్రాజెక్టు అదేనా?

నాలుగైదు వరుస హిట్ లతో అక్కినేని లక్కీ లేడీ అనిపించుకున్న సమంత ప్రస్తుతం అమెజాన్ వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నారు. అదికాక శర్వానంద్ సరసన 96 సినిమా రీమేక్ చేస్తున్నారు. అయితే ఆ తరువాత…

నాలుగైదు వరుస హిట్ లతో అక్కినేని లక్కీ లేడీ అనిపించుకున్న సమంత ప్రస్తుతం అమెజాన్ వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నారు. అదికాక శర్వానంద్ సరసన 96 సినిమా రీమేక్ చేస్తున్నారు. అయితే ఆ తరువాత ఏంటీ? అంటే ఆసక్తి కరమైన గ్యాసిప్ వినిపిస్తోంది.

అన్నపూర్ణ బ్యానర్ లో ఓ విలక్షణమైన సినిమా సమంత చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ సినిమాలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో సమంత కూడా క్రీడాకారిణిగా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. షటిల్ క్రీడాకారిణిగా సమంత నటించబోతున్నట్లు, ఈ సినిమాను అన్నపూర్ణ బ్యానర్ పైనే నిర్మిస్తారని తెలుస్తోంది.

అయితే షటిల్ క్రీడాకారిణిగా అంటే కల్పిత కథతోనా, లేకా బయోపిక్ లాంటిదా అన్నది ఇంకా తెలియదు. ప్రస్తుతానికి ఈ సినిమా స్క్రిప్ట్ దశలో వుందని, ప్రాధమిక చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది. ఓ బేబీ సినిమాకు మంచి మాటలు అందించిన లక్ష్మీ భూపాల్ నే ఈ సినిమాకు కూడా మాటలు అందిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి.

శివరామకృష్ణన్ కమిటీ ఏం చెప్పిందంటే!