సమంత ఔట్‌?

రామ్‌చ‌ర‌ణ్ – స‌మంత‌… ఈ జంట‌ని తొలిసారి వెండి తెర‌పై చూసి త‌రిద్దాం అనుకొన్న మెగాఫ్యాన్స్ ఇంకొంత కాలం ఆగాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా నుంచి స‌మంత ఔట్ అయిన‌ట్టు లేటెస్ట్ న్యూస్‌. స‌మంత…

రామ్‌చ‌ర‌ణ్ – స‌మంత‌… ఈ జంట‌ని తొలిసారి వెండి తెర‌పై చూసి త‌రిద్దాం అనుకొన్న మెగాఫ్యాన్స్ ఇంకొంత కాలం ఆగాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా నుంచి స‌మంత ఔట్ అయిన‌ట్టు లేటెస్ట్ న్యూస్‌. స‌మంత ఈ సినిమా నుంచి 'అవుట్‌' అయ్యింద‌ట‌. స‌మంత ప్లేసులో మ‌రో క‌థానాయిక కోసం అన్వేషిస్తున్నట్టు లేటెస్ట్ టాక్‌. 

చ‌ర‌ణ్ – శ్రీ‌నువైట్ల క‌ల‌యిక‌లో రూపుదిద్దుకొనే ఈ చిత్రం త్వర‌లోనే సెట్స్‌పైకి వెళ్తోంది. సంగీత ద‌ర్శకుడిగా కొల‌వెరి అనిరుధ్ ఓకే అయ్యాడు. ఇప్పుడు హీరోయిన్ ద‌గ్గరే స‌మ‌స్య వ‌చ్చి ప‌డింది. 

స‌మంత కావాల‌ని త‌ప్పుకొందా, లేదంటే స‌మంత కంటే బెట‌ర్ ఆప్షన్ కోసం టీమ్ వెదుకుతోందా… అనేది తెలియాల్సివుంది. మొత్తానికి చ‌ర‌ణ్ – స‌మంత కెమిస్ట్రీ ఇంకా `వెయిటింగ్ లిస్ట్‌`లోనే ఉంది.