సమస్య ఆ హీరోయిన్ తోనా?

ఓ ప్రముఖ దర్శకుడి వివాహ బంధం చిక్కుల్లో పడిందని వార్తలు రాగానే టాలీవుడ్ లో గుసగుసలు ప్రారంభమయ్యాయి. దీనివెనుక ఓ హీరోయిన్ వ్యవహారం దాగివుందని వినిపించడం ప్రారంభమైంది. ఆ హీరోయిన్ తో ఆ దర్శకుడు…

ఓ ప్రముఖ దర్శకుడి వివాహ బంధం చిక్కుల్లో పడిందని వార్తలు రాగానే టాలీవుడ్ లో గుసగుసలు ప్రారంభమయ్యాయి. దీనివెనుక ఓ హీరోయిన్ వ్యవహారం దాగివుందని వినిపించడం ప్రారంభమైంది. ఆ హీరోయిన్ తో ఆ దర్శకుడు సినిమా తీసిన టైమ్ లోనే అసలు కథ మొదలైందని వినిపిస్తోంది. ఆ సినిమా నిర్మాణ సమయం అంతా ఆ హీరోయిన్ ముంబాయి నుంచి వచ్చి, దర్శకుడి ఇంట్లోనే వుండేదని, సాధారణంగా హీరోయిన్ లు హోటళ్లలో వుండడం కామన్ అని ఈ గుసగుసల సారాంశం.

పెళ్లయిన తరువాత కూడా ఆ హీరోయిన్ తో చనువు లేదా సాన్నిహిత్యం కారణంగానే విబేధాలు వచ్చాయని వినిపిస్తోంది. అయితే దర్శకుడి విడాకుల వ్యవహారం వార్తలు ఇండస్ట్రీలో పెద్దగా హల్ చల్ చేయలేదు. ఈ హీరోయిన్ తో వ్యవహారం నడుస్తోందని తెలిసినందున, ఇలాంటిది ఏదో జరుగుతుందనే అనుకున్నామని కామెంట్ లు మాత్రం వినిపించాయి.

అయితే విషయం రచ్చకు ఎక్కకుండా, ఎమికబుల్ గా సెటిల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఏమైనా హీరోయిన్లు అందంగా వుండడం వరకు ఓకేకానీ అందమైన కాపురాల్లో దూరితే మాత్రం ఇలాంటి విపరిణామాలే సంభవిస్తాయేమో?