టాలీవుడ్ సమ్మె వ్వవహారం అలా పడి వుంది. ఏ రోజుకు ఆ రోజు కాలాఫ్ అవుతుందని నిర్మాతలు ఆశాభావంతో వున్నారు. పండుగకు విడుదల కావాల్సిన సినిమాల నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు. ఈ రోజు ఎలాగైనా కాలాఫ్ అవుతుందని ఆశిస్తున్నట్లు నిర్మాత బండ్ల గణేష్ అన్నారు.
ఎవరి చేతుల్లో ఏమీ వున్నట్లు కనిపించడం లేదని, నిర్మాతల పరిస్థితి గాలిలో దీపంగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఎవరైనా కావాలని సమ్మెను సాగదీస్తున్నారని భావిస్తున్నారా అని ప్రశ్నిస్తే, తాను అలా అనుకోవడం లేదని, ఇక్కడ ఏదీ ఎవరూ ఊహించే పరిస్థితి లేదని బదులిచ్చారు.
తమ సినిమా చాలా వరకు పూర్తయిందని, ఇక కొద్దిగా షూటింగ్ పార్ట్ మిగిలిందని అన్నారు. ఇదిలా వుంటే మేము సైతం కార్యక్రమం ముగియడంతో, ఇప్పుడు చాంబర్ పెద్దలు సమ్మెపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.