సందీప్ కు దొరికిన బీరువా

సందీప్ కిషన్ కెరియర్ పడుతూ లేస్తోంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో కాస్త ఊపు వచ్చినా, ఇంకా సరియైన ట్రాక్ లో పడలేదు. అందుకే కాస్త ఆచి తూచి సినిమాలకు ఊ కొడుతున్నాడు. అలా…

సందీప్ కిషన్ కెరియర్ పడుతూ లేస్తోంది. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తో కాస్త ఊపు వచ్చినా, ఇంకా సరియైన ట్రాక్ లో పడలేదు. అందుకే కాస్త ఆచి తూచి సినిమాలకు ఊ కొడుతున్నాడు. అలా తాజాగా అంగీకరించిన సినిమా ఒకటివుంది. దీనికి తమిళ తంబి కణ్మణి దర్శకుడు. ఓ చిన్న తరహా ప్రయోగం ఈ సినిమా. 

కథ మొత్తం ఓ బీరువా చుట్టూ తిరుగుతుంది. ఇటీవల తమిళ సినిమాలో తొలిసారి నటించిన ఢిల్లీ అమ్మడు సురభి ఈ సినిమాలో హీరోయిన్. సినిమా కు నిర్మాత జెమిని కిరణ్. మొత్తానికి ఇదేదో కాస్త వైవిధ్యంగా వుండేలాగే వుంది.