ఇంకా సినిమాలు వస్తున్నాయి

ఫ్లాపులు, ఫాలోయింగ్ తొ సంబంధం లేకుండా సినిమాలు దొరకపుచ్చుకునే ఏకైక హీరో వరుణ్ సందేశ్. శాటిలైట్ మార్కెట్ డవున్ అవడంతో ఈ మధ్య కాస్త తగ్గాడు. కానీ మళ్లీ ఓ సినిమా దొరకపుచ్చుకున్నాడు. లవకుశ…

ఫ్లాపులు, ఫాలోయింగ్ తొ సంబంధం లేకుండా సినిమాలు దొరకపుచ్చుకునే ఏకైక హీరో వరుణ్ సందేశ్. శాటిలైట్ మార్కెట్ డవున్ అవడంతో ఈ మధ్య కాస్త తగ్గాడు. కానీ మళ్లీ ఓ సినిమా దొరకపుచ్చుకున్నాడు. లవకుశ అనే సినిమా, అదీ ద్విపాత్రాభినయం. ఈ సినిమాకు ఓ కొత్త దర్శకుడు సారథ్యం వహిస్తాడు. 

యముడికి మొగుడులో నరేష్ తో ఆడిపాడిన రిచా పనాయ్ కథానాయిక. డబుల్ రోల్ కాబట్టి మరో హీరోయిన్ కావాలి..సింగిల్ హీరో చాన్స్ కొసమే జనాలు మొహం వాచిపోతుంటే, డబుల్ రోల్స్ కూడా కొట్టేస్తున్నాడు. వరుణ్ సందేశ్ కు హిట్ లు లేవుకానీ, సుడి వుంది ఎక్కడో?