Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సంక్రాంతి బరి నుంచి ఒక హీరో డ్రాప్?!

సంక్రాంతి బరి నుంచి ఒక హీరో డ్రాప్?!

తెలుగు చలన చిత్ర చరిత్రలో ఏనాడూ లేని విధంగా.. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. నలుగురూ వచ్చే సంక్రాంతికి తమ తమ సినిమాలతో పోటీలోకి ఉంటారనే మాటే వినిపించింది. రీ ఎంట్రీ సినిమాతో చిరు, వందో సినిమాతో బాలకృష్ణ, భక్తి సినిమాతో నాగార్జున, రీమేక్ సినిమాతో వెంకీ.. సంక్రాంతి పోరును రంజుగా మారుస్తారనిపించింది.

ఇది వరకూ చరిత్రలో వీరిలో ముగ్గురు ఒకేసారి బరిలోకి దిగిన సందర్భాలున్నాయి. అయితే నలుగురూ ఒకేసారి బరిలోకి దిగడం మాత్రం ఆసక్తికరంగా నిలిచింది. అయితే.. ఇప్పుడు వినిపిస్తున్న మాటేమిటంటే.. వచ్చే సంక్రాంతి పోరులో వీరిలో ఒకరు డ్రాప్ అయినట్టే అనేది! 

అది మరెవరో కాదు.. అక్కినేని నాగార్జున. “ఓం నమో వేంకటేశాయా’’ సినిమాతో నాగ్ సంక్రాంతి బరిలో నిలవడం ఖాయంగా కనిపించడం లేదిప్పుడు. సంక్రాంతికి మరెంతో దూరం లేదు. ఈ పరిమిత వ్యవధిలో రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందుతున్న ఆ సినిమా పూర్తి అయ్యే అవకాశాలు లేవని.. అందుకే నాగార్జున బరి నుంచి తప్పుకునే అవకాశాలున్నాయనే మాట వినిపిస్తోంది.

దీంతో సంక్రాంతి బరిలో చిరు, బాలయ్య, వెంకీలు మాత్రమే మిగిలినట్టు అవుతోంది. ఇది వరకూ కూడా ఈ ముగ్గురూ పలు సార్లు సంక్రాంతి సందర్భంగా తమ సినిమాలతో తలపడ్డారు. మళ్లీ అదే పునరావృతం అవుతోంది. ఇక నాగ్ విషయానికి వస్తే.. మొన్నటి ఈ ఏడాది సంక్రాంతికి ‘సోగ్గాడే చిన్నినాయన’’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. వచ్చే ఏడాది మాత్రం తన సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?