వాళ్ళే చంపాలా.? వీళ్ళెందుకు చంపకూడదు.!

ముంబైలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల మారణహోమం.. 160 మందికి పైగా మృతి..  Advertisement దేశ ఆర్థిక రాజధాని అతలాకుతలం.. వణికిన వాణిజ్య రాజధాని..  ఇది ఒకప్పటి ముంబై టెర్రర్‌ ఘటన తాలూకు వ్యవహారం. ఆ…

ముంబైలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల మారణహోమం.. 160 మందికి పైగా మృతి.. 

దేశ ఆర్థిక రాజధాని అతలాకుతలం.. వణికిన వాణిజ్య రాజధాని.. 

ఇది ఒకప్పటి ముంబై టెర్రర్‌ ఘటన తాలూకు వ్యవహారం. ఆ ఘటనలో చాలామంది పోలీసులు చనిపోయారు. ఏటీఎస్‌ చీఫ్‌ హేమంత్‌ కర్కరేతోపాటు, ఎన్‌ఎస్‌జి కమెండోలను కోల్పోయాం. తీవ్రవాదులు ఎంచక్కా బోట్ల సాయంతో సముద్ర మార్గాన ముంబైపై దాడికి దిగారు. అంతకుముందెన్నడూ అలాంటి దాడిని మనం ఊహించకపోవడంతో, నష్టం చాలా ఎక్కువే జరిగింది. అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. 

అయితే, ఆనాటి ఘటనలో ఎన్‌ఎస్‌జీ, ఏటీఎస్‌, సాధారణ పోలీసులు.. తీవ్రవాదుల్ని నిలువరించడంలో సఫలమయ్యారు. ఈ క్రమంలో కొందరు టెర్రరిస్టులు హతమైతే, ఒక టెర్రరిస్ట్‌ కసబ్‌ సజీవంగా పట్టుబడ్డాడు. ఇది కట్టు కథ కాదు, వాస్తవం. దేశ ఆర్థిక రాజధానిపై నెత్తుటి పంజాకి ఇది నిదర్శనం. ఆనాటి ఆ ఘటన గురించి ఇప్పుడు తలచుకున్నా ఒళ్ళు గగుర్పాటుకు గురికాకుండా వుండదు. తాజ్‌ హోటల్‌, సీఎస్‌టీ, నారమన్‌ హౌస్‌ ప్రాంతాల్లో.. ఆ నాటి నెత్తుటి చారికలు ఇంకా భయం గొలుపుతూనే వుంటాయి. 

ఏం చేద్దాం, ఇలాంటి టెర్రరిస్టుల్ని.? కాల్చి పారెయ్యొదా.? మధ్యప్రదేశ్‌లో పోలీసులు, తీవ్రవాదుల్ని ఎన్‌కౌంటర్‌ చేస్తే.. పొలిటికల్‌ పోటుగాళ్ళు తెరపైకొచ్చేసి నానా హంగామా చేసేస్తున్నారు. ఒకాయనకి, తీవ్రవాదులు వాచీలు ధరించడమేంటి.? షూస్‌ వేసుకోవడమేంటి.? అని అమాయకంగా ప్రశ్నించేస్తాడు. ఇంకొకాయన, ఇది అక్రమం.. అన్యాయం.. దుర్మార్గం.. అంటూ మండిపడత్తాడు. ఇంకొకాయన, సుప్రీంకోర్టు జడ్జితో కమిటీ వేయించి, విచారణ జరపాలంటాడు. 

సరిహద్దుల్లో పాక్‌ సైన్యం అండతో, పాకిస్తాన్‌ ప్రేరేపిత తీవ్రవాదులు ఓ జవాన్‌ని అతి కిరాతకంగా చంపి, అతని శరీరాన్ని ముక్కలు చేస్తే.. ఈ పోటుగాళ్ళలో ఒక్కడంటే ఒక్కడు కూడా, ఆ ఘటనపై స్పందించలేదుగానీ.. తీవ్రవాదులు చనిపోతే మొసలి కన్నీరు కార్చేస్తున్నారు. అసలు ఇలాంటి నేతలు, బారతదేశంలో వుండడానికి అర్హులా.? అన్న చర్చ జరుగుతోందిప్పుడు. 

తీవ్రవాదులు పొరుగుదేశం నుంచి వస్తున్నారు.. అన్నది ఎంత నిజమో, వారికి మద్దతుగా నిలుస్తున్న సోకాల్డ్‌ పోటుగాళ్ళను కూడా తీవ్రవాదులగానే చూడాలన్నది నెటిజన్ల మాట. తీవ్రవాదులు దేశంలో మారణహోమం సృష్టించొచ్చా.? వారిని మాత్రం శిక్షించకూడదా.? ఇదెక్కడి లాజిక్‌.. అని నెటిజన్లు సంధిస్తున్న ప్రశ్నలకు సోకాల్డ్‌ పొలిటికల్‌ పోటుగాళ్ళు ఏం సమాధానం చెబుతారట.!