అడియో ఫంక్షన్ జరగాల్సిన రోజును పక్కన పెడితే, మూడు రోజులు మిగిలాయి..ఇదంతా సర్దార్ గబ్బర్ సింగ్ అడియో ఫంక్షన్ సంగతే. ఇప్పటికి ఏర్పాట్లు షురూ కాలేదు. వెన్యూ ఫైనల్ కాలేదు. ఏ వెన్యూ ఎంపిక చేసినా అనుమతి రావడం లేదని వినికిడి. నోవాటెల్ ను ప్రయత్నిస్తున్నారు. కానీ జనసేన ఆవిర్భావం అక్కడే జరిగింది. అప్పుడు జరిగిన హడావుడి, జనాలను చూసిన నోవాటెల్ ఇప్పుడు మరోసారి వెన్యూ ఇవ్వడానికి ముందు వెనుకలు ఆడుతోందని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.
గచ్చిబౌలి స్టేడియం, నిజాం గ్రవుండ్స్, అన్నీ ట్రయ్ చేసినా పర్మిషన్ రాలేదని వినికిడి. ఇదిలా వుంటే ఈ అడియో ఫంక్షన్ కు సంబంధించి చిత్రమైన సంగతులు వినిపిస్తున్నాయి. అడియో ఫంక్షన్ హక్కులను యాభై లక్షలకు ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థకు ఇచ్చినట్లు వినికిడి. సాధారణంగా అలా ఇస్తే, ఆ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ స్పాన్సర్లను తెచ్చుకుని, టీవీలో ప్రసారం చేసి, ప్రకటనల్లో వాటా తీసుకుని ఆ మొత్తాన్ని తిరిగి సంపాదించుకుంటుంది.
కానీ ఇక్కడ టీవీ హక్కులు మాత్రం సర్దార్ సినిమా సంస్థకే వుంచుకుంటామని స్పష్టం చేసారని వినికిడి. తమకు యాభై లక్షలు ఇవ్వాలని, అలాగే పాతిక లక్షలు ఖర్చయ్యేలా భారీగా ఈవెంట్ నిర్వహించాలని షరతు పెట్టారట. దీంతో పోటీపడిన చాలా ఈవెంట్ సంస్థలు వెనక్కు వెళ్లాయి. ఆఖరికి ఓ సంస్థ ఓకె అంది. కానీ సదరు సంస్థకు ఇప్పుడు 75లక్షల మేరకు స్పాన్సర్లు కావాలి. ఆ స్పాన్సర్లు దొరక్క ఆ సంస్థ తెగ వర్రీ అవుతోందని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే రెండు చానెళ్లు చెరో యాభై లక్షలు నిర్మాతకు ఇవ్వడానికి అంగీకరించి లైవ్ హక్కులు పొందాయి. అంటే నిర్మాతకు అడియో ఫంక్షన్ మీద ఇలా కోటి, అలా యాభై కలిపి కోటిన్నర కనీసపు ఆదాయం అన్నమాట. నిర్మాత వరకు బాగానే వుంది. ఈవెంట్ కంపెనీకే ఈ యాభై లక్షలకు స్పాన్సర్ దొరకడం లేదని వినికికి. కావాలంటే పాతిక లక్షలు ఖర్చయ్యే ఈవెంట్ స్పాన్సర్ చేస్తామని, యాభై అంటే కష్టమని అంటున్నారట చాలా మంది. దాంతో ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ తెగ వెదుకులాడుతోందని గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి.