‘సరిలేరు’…హిందీ డిజిటల్. శాటిలైట్..15.25

సూపర్ స్టార్ మహేష్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తయారవుతున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా హిందీ డిజిటల్, డబ్బింగ్ బిజినెస్ పూర్తయింది. ఈ మధ్య కాలంలో హిందీ మార్కెట్ డౌన్ కావడంతో మన సినిమాలను…

సూపర్ స్టార్ మహేష్ బాబు-అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తయారవుతున్న సరిలేరు నీకెవ్వరూ సినిమా హిందీ డిజిటల్, డబ్బింగ్ బిజినెస్ పూర్తయింది. ఈ మధ్య కాలంలో హిందీ మార్కెట్ డౌన్ కావడంతో మన సినిమాలను కొనడం ఆపేసారు. దాంతో హిందీ మార్కెట్ ను బేస్ చేసుకున్న చాలా సినిమాలు ఇబ్బందుల్లో పడ్డాయి. చాణక్య లాంటి సినిమాలు బేరం కుదిరిన తరువాత కూడా సగంలో ఆగాయి.

మన సినిమాల్లో వుండే యాక్షన్ సీన్లు బాలీవుడ్ డిజిటల్ ఆడియన్స్ కు నచ్చడంతో మన సినిమాల డిజిటల్ రైట్స్ మంచి రేట్లు ఇచ్చి కొనేవారు. బెల్లంకొండ శ్రీనివాస్ లాంటి హీరోలకు సినిమాలు రావడానికి హిందీ మార్కెట్ కూడా ఓ కారణం. కానీ అలాంటిది ఉన్నట్లుండి ఆ మార్కెట్ పడిపోయింది. 

పండగకు రిలీజ్ కావాల్సిన పెద్ద సినిమాలు కూడా ఇప్పటి వరకు కొనలేదు. ఆఖరికి నిన్నటికి నిన్న సరిలేరు నీకెవ్వరూ సినిమా హిందీ డిజిటల్, శాటిలైట్ బిజినెస్ క్లోజ్ అయింది. 15 కోట్ల 25 లక్షలకు డీల్ కుదిరింది. మహర్షి సినిమా 20 కోట్లకు విక్రయిస్తే, సరిలేరు అయిదు కోట్లు తక్కువగా విక్రయించాల్సి వచ్చింది.

ఇదిలా వుండగా మెగాస్టార్ మెగా మూవీ సైరా హిందీ డీల్ కూడా కుదిరింది. తొమ్మిది కోట్ల మేరకు విక్రయించినట్లు తెలుస్తోంది.