Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సర్కారు వారి పాట..ట్రోలింగ్ భయం

సర్కారు వారి పాట..ట్రోలింగ్ భయం

ఆర్ఆర్ఆర్..ఆచార్య..ఇప్పుడు సర్కారు వారి పాట. ఈ మూడింటికి వున్న లింక్ ఏమిటి? అంటే లింక్ వుంది. సోషల్ మీడియా లింక్. ఫ్యాన్స్ లింక్. అన్నింటికీ మించి ట్రోలింగ్ లింక్. 

ఆర్ఆర్ఆర్ లో ఎన్టీఆర్ గొప్పా? రామ్ చరణ్ గొప్పా? అన్న వివాదం కమ్ ట్రోలింగ్ సోషల్ మీడియాలో తెగ నడిచింది. ఆ టైమ్ లో ఎవరి లెవెల్ లో వారు అటు ఇటు బాణాలు వదులుతూనే వున్నారు. ఆ యుద్దంలో రామ్ చరణ్ ఫ్యాన్స్ ది కాస్త పై చేయి అయింది.

ఆ ఎఫెక్ట్ ఆచార్య మీద పడింది. సినిమా బాగా లేదన్న సంగతి పక్కన పెడితే తెల్లవారు ఝాము నుంచే ఆ సినిమా మీద పడిపోయింది సోషల్ మీడియా. ఒక టెన్ పర్సంట్ అయినా లేచి నిల్చుంటుందేమో అనుకునే సినిమాను శక్తి కొద్దీ బాదేసింది..కింద పడేసింది.

ఇప్పుడు ఆ కోపం ఆ కసి సర్కారు మీదకు మళ్లేలా కనిపిస్తోంది. అదేంటీ…అది ఎన్టీఆర్ ఇది మహేష్ కదా అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఇక్కడ మెగా ఫ్యాన్స్, యాంటీ మెగా హీరోల ఫ్యాన్స్. వీటిల్లో మళ్లీ సామాజిక వైరాలు కూడా వున్నాయి. 

ఇక్కడ సర్కారు అదృష్టం ఏమిటంటే, కొన్ని ‘తెల్లవారుఝాము’ మీడియా సంస్థలు కూడా ‘కొరటాల’ మీద కోపంతో ఆచార్య విషయంలో ముందే కూత మొదలుపెట్టేసాయి. కానీ ఇవే మీడియా సంస్థలకు మహేష్ టీమ్ తో సమస్య లు లేవు. అందువల్ల ఈ ‘తెల్లవారుఝాము’ కూతలు కొంత అనుకూలంగా వుంటాయన్న గ్యాసిప్ లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

మొత్తం మీద ఈసారి ట్రోలింగ్ ఎలా వుండబోతోందో? ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?