శాతకర్ణి ఓవర్ ఫ్లోస్ కోసం పోటీ

ఒక పక్క మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 రెవెన్యూ విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేసే దిశగా దూసుకుపోతుంటే, శాతకర్ణి పై కూడా కొందరి బాగానే ఆశలు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే అమెరికా కంపెనీతో టైఅప్…

ఒక పక్క మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150 రెవెన్యూ విషయంలో కొత్త రికార్డులు క్రియేట్ చేసే దిశగా దూసుకుపోతుంటే, శాతకర్ణి పై కూడా కొందరి బాగానే ఆశలు పెట్టుకుంటున్నారు. ఇప్పటికే అమెరికా కంపెనీతో టైఅప్ వున్న ఓ ముంబాయి కంపెనీ శాతకర్ణి ఓవర్ ఫ్లోస్ పై బేరాలు సాగిస్తోంది. 

ఇలాంటి నేపథ్యంలో నిన్నటికి నిన్న బాలయ్య ఫ్యామిలీతో కలిసి సినిమా చూసిన నిర్మాతలు సాయి కొర్రపాటి, దగ్గుబాటి సురేష్ ఓ కొత్త ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. సాయి కొర్రపాటి సీడెడ్, వైజాగ్ కు, సురేష్ తో కలిసి ఈస్ట్ కు రైట్స్ తీసుకున్నారు. అయితే ఇది అవుట్ రేట్ కు కాకుండా ఓవర్ ఫ్లోస్ వుంచుకుని ఇచ్చారు.

ఇప్పుడు అలా కాదు, అవుట్ రేట్ కు ఇచ్చేయమని సాయి, సురేష్ బేరాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఓవర్ ఫ్లోస్ తో సంబంధం లేకుండా అవుట్ రేట్ కు ఇచ్చేయమని వారు క్రిష్ ను వత్తిడి చేస్తున్నారట. మరి సినిమా మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంతలా ఎలా పెరిగిపోయాయో? రాత్రికి రాత్రి.