Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

సవ్యసాచి ఆగస్టులో కూడా అనుమానమేనా?

సవ్యసాచి ఆగస్టులో కూడా అనుమానమేనా?

ఈ సమ్మర్ కే విడుదల అన్నారు నాగ్ చైతన్య సవ్యసాచి సినిమాను. కానీ ఇప్పటికి రెడీ కాలేదు. లేటెస్ట్ డేట్ ఆగస్టు 10 అన్నది. కానీ పరిస్థితి చూస్తుంటే అప్పటికి కూడా రెడీ అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఇప్పుడు నాగ్ చైతన్య తన శైలజరెడ్డి సినిమా సెట్ మీదకు వెళ్లిపోతున్నారు.

రేపటి నుంచి దాదాపు నెలరోజుల పాటు పెద్ద షెడ్యూల్ ను రామోజీ ఫిలిమ్ సిటీలో ప్లాన్ చేస్తారు. దీంతో శైలజారెడ్డి వర్క్ పూర్తయిపోతుంది. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ దాదాపు పూర్తయి, డబ్బింగ్ కూడా ఫినిష్ చేసుకుంది. మరో వారంలో ఆర్ ఆర్ కు ఫస్ట్ హాఫ్ వెళ్లిపోతుంది.

కానీ సవ్యసాచికి ఇంకా టెన్ డేస్ వర్క్ వుంది. ప్లస్ రీషూట్ లు కూడా వున్నాయని తెలుస్తోంది. శైలజరెడ్డి నుంచి చైతన్య వచ్చేనెల ఇరవై నాలుగుకు కానీ ఫ్రీ కాడు. ఆ తరువాత నుంచి సవ్యసాచి స్టార్ట్ చేస్తే, ఆగస్టు ఫస్ వీక్ దాటిపోతుంది. అప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేయాలి. ఎలా లేదన్నా ఆగస్టు 20 వచ్చేస్తుందని తెలుస్తోంది.

మరోపక్క శైలజరెడ్డి రిలీజ్ డేట్ ఆగస్టు 31 అని ఫిక్స్ అయ్యారు. త్వరలో ఇది అనౌన్స్ కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరోపక్క సవ్యసాచి గ్రాఫిక్స్ పనులు కొత్త కంపెనీకి ఇచ్చి మళ్లీ మొదటి నుంచీ తయారుచేయిస్తున్నారు. 

ఇలాంటి పరిస్థితుల్లో సవ్యసాచి కిందామీదా పడి ఆగస్టు 10కి రెడీ కావాలి లేదా సెప్టెంబర్ కు వెళ్లిపోవాలి. రెండో దానికే చాన్స్ ఎక్కువ అని తెలుస్తోంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?