Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

'సైరా' టైటిల్‌ వెనుక ఆ సెంటిమెంట్‌ ఉందా?

'సైరా' టైటిల్‌ వెనుక ఆ సెంటిమెంట్‌ ఉందా?

కొంతమంది హీరోలకు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. వాటిల్లో కొన్ని పాటించేవి ఉంటాయి. మరికొన్ని అనుకోకుండా జరిగేవి ఉంటాయి. ఫలానా రకం టైటిల్‌తో ఫలానా హీరో వస్తే ఆ సినిమా హిట్టే అనే అభిప్రాయాలు తరచూ వినిపిస్త్తూ ఉంటాయి. పెద్ద హీరోల విషయంలో కూడా అలాంటి సెంటిమెంట్స్‌కు లోటు లేదు. అందుకు ఉదాహరణ నందమూరి బాలయ్య. ఈ హీరో సినిమాల్లో 'సింహా' అనే ధ్వని వచ్చిందంటే ఆ సినిమా హిట్‌ అనే నమ్మకం ఉంది. ఇది ఈ నాటిది కాదు దశాబ్ధాల నుంచి వినిపించే మాటే.

అలాగని బాలయ్య 'సింహా'లన్నీ విజయవంతం కాలేదు. కొన్ని డిజాస్టర్లు కూడా ఉన్నాయి. అయితే బాలయ్యకు సింహా అచ్చొచ్చింది అనేది అభిమానుల నుంచి వినిపించే మాట. బొబ్బిలి సింహం, సమరసింహారెడ్డి, నరసింహ నాయుడు, సింహా.. ఇవన్నీ బాలయ్య సూపర్‌ హిట్టు. అయితే సీమసింహం వంటి డిజాస్టర్‌ కూడా ఉంది. ఈ మధ్యనే వచ్చిన 'జై సింహా' విషయంలో కూడా ఈ సెంటిమెంట్‌ హడావుడి చేశారు.

బాలయ్యకు సింహా టైటిల్‌ అచ్చొచ్చిందని.. జైసింహా కూడా అదే రీతిన హిట్‌ అవుతుందని ప్రచారం చేసుకున్నారు. అయితే జై సింహా ఫలితం తేడా కొట్టింది. ఈ సినిమా కమర్షియల్‌గా కొంతవరకూ డబ్బులు రాబట్టుకున్నప్పటికీ.. ప్రశంసలు మాత్రం పొందలేకపోయింది. అభిమానులను కూడా పూర్తిగా సంతోష పెట్టలేకపోయింది. ప్రత్యేకించి బాలయ్య సింహాలకు ధీటుగా నిలవలేకపోయింది జైసింహా. ఇలా సింహా టైటిల్‌ బాలయ్యకు తేడా కొట్టేసింది.

ఇక చిరంజీవికి అయితే సింహా టైటిల్‌ మొదటి నుంచి తేడా కొడుతూనే ఉంది. సింహా కలుపుకునే టైటిల్‌తో చిరంజీవి సినిమాలు కొన్ని వచ్చాయి. సింహపురి సింహం దగ్గర నుంచి ఈ జాబితాను చూస్తే.. కొందమసింహం, మృగరాజు సినిమాలు అంతగా ఆడలేదు. మృగరాజు అంటే సింహమే కదా. అంతేగాక చిరంజీవికి సినిమాల్లో పేరులో సింహం వచ్చిన ఆ సినిమాలు తేడాకొట్టిన దాఖలాలున్నాయి. వాటిల్లో ఒకటి 'స్నేహం కోసం'. అందులో పెద్ద చిరంజీవి పేరు సింహాద్రి.

తమిళంలో వచ్చిన సినిమాకు రీమేకగా వచ్చిన స్నేహం కోసం తెలుగులో ఆడలేదు. ఈ విధంగా చిరంజీవికి 'సింహా' సెంటిమెంట్‌ నెగిటివ్‌గా నిలిచింది. ఇలాంటి నేపథ్యంలోనే 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి' సినిమా టైటిల్‌ను కొంత మార్చారని టాక్‌. ముందుగా ఈ సినిమాకు ఆ టైటిల్‌ అనుకున్నా తర్వాత 'సైరా'గా మార్చిన సంగతి తెలిసిందే. ఈ క్యాచీ టైటిల్‌తో హిందీలో కూడా ఈ సినిమాను మార్కెట్‌ చేసుకోవచ్చని దీని రూపకర్తలు భావిస్తున్నారు.

అలాగని ఉయ్యాలవాడ టైటిల్‌ను పూర్తిగా మార్చకుండా 'సైరా.. నరసింహారెడ్డి'గా టైటిల్ను ఫిక్స్‌ చేశారు. అంతిమంగా 'సింహా'ను అయితే వదిలించుకోలేకపోయారు. సినిమాలోనూ హీరో పేరు ఎలాగూ నరసింహారెడ్డి అవుతుంది. టైటిల్‌లోనూ సింహా ధ్వనిస్తోంది. సెంటిమెంట్‌ సంగతెలా ఉన్నా.. ఈ సబ్జెక్ట్‌ విషయంలో మాత్రం చిరంజీవి ఫుల్‌ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. ఈ సినిమా సూపర్‌ హిట్‌ గ్యారెంటీ అనే నమ్మకం వీరిలో ఉంది.

సబ్జెక్టులో సత్తా ఉంది కాబట్టి.. మంచి స్క్రిప్ట్‌ కుదిరితే సినిమా సూపర్‌ హిట్‌ కావడం గ్యారెంటీ. ఈ సినిమా సూపర్‌ హిట్‌ అయితే చిరంజీవికి 'సింహా' సెంటిమెంట్‌ కలిసిరావడం మొదలైనట్టే!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?