ఒకవైపు స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి.. మామూలుగా అయితే జూన్ 12 వరకూ స్కూల్స్ స్టార్ట్ కావు. అయితే రోజులు మారాయి. దక్షిణాది రాష్ట్రాల్లో ఇప్పటికే చాలా ప్రైవేట్ స్కూల్స్ ఓపెన్ అయిపోయాయి. మిగతా చోట్ల కూడా పిల్లలు పుస్తకాలు కొనుక్కోవడంలో బిజీగా ఉన్నారు. తల్లిదండ్రులు ఈ వ్యవహారాలతో బిజీగా ఉన్నారు. సినిమాల విడుదలకు ఇది తగిన సమయం కాదు అని చెప్పవచ్చు. ఇలాంటి సమయంలో వచ్చింది కాలా. ఎప్పుడో విడుదల కావాల్సి ఉన్నా వాయిదాలతో ఈ సినిమా ఇప్పుడు వచ్చింది.
సమ్మర్ హాలిడేస్‌లో ఇలాంటి సినిమా వస్తే పిల్లాపెద్దా ఎంచక్కా వెళతారు కానీ.. స్కూల్స్ స్టార్ట్ అవుతున్న దశలో ఫ్యామిలీ ఆడియన్స్‌ను థియేటర్ల వైపు రప్పించడం అంత ఈజీ కాదు. రజనీకాంత్ మ్యాజిక్‌కు ఇది పెద్ద పరీక్షే. ఒకవేళ రజనీకాంత్ మంచి ఫామ్‌లో అయినా ఉండుంటే, అదో కథ. రజనీకాంత్ గత రెండు సినిమాలూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో తెలుగునాట జనాలను థియేటర్ల బాట పట్టించడం రజనీకి అంత సులభంకాదు.
సినిమా కూడా ఫర్వాలేదనేపించుకునే రేటింగులు పొందడం ఈ భారీ సినిమాపై ప్రభావం చూపవచ్చు. తమిళనాట పరిస్థితి ఏమిటి? అంటే.. గత రెండు ఫెయిల్యూర్ల ప్రభావం ఉందని, అలాగే స్కూల్స్ స్టార్ట్ కావడం ఈ సినిమా వసూళ్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.