సాహోలో అసలు సీక్రెట్ ఇదేనా?

మొన్నటివరకు సినిమా బడ్జెట్ గురించే మాట్లాడుకున్నారు. దుబాయ్ లో తీసిన యాక్షన్ ఎపిసోడ్ గురించి చర్చించుకున్నారు. కానీ విడుదలకు సరిగ్గా ఇంకో 4 రోజుల ముందు సాహో అసలు కథ మొదలైంది. ఈ సినిమా…

మొన్నటివరకు సినిమా బడ్జెట్ గురించే మాట్లాడుకున్నారు. దుబాయ్ లో తీసిన యాక్షన్ ఎపిసోడ్ గురించి చర్చించుకున్నారు. కానీ విడుదలకు సరిగ్గా ఇంకో 4 రోజుల ముందు సాహో అసలు కథ మొదలైంది. ఈ సినిమా స్టోరీపై సోషల్ మీడియాలో రోజుకో ఊహాగానం పుట్టుకొస్తోంది. గమ్మత్తైన విషయం ఏంటంటే.. అలా వైరల్ అవుతున్న పోస్టుల్లో దాదాపు 90శాతం నిజాలే.

అవును.. సాహో సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ హైలెట్. సినిమా ఎంత రిచ్ గా ఉన్నప్పటికీ, ప్రభాస్ పాత్రలో ఉన్న మలుపులు, కొన్ని సందర్భాల్లో వచ్చే అతడి మేకోవర్ టోటల్ సినిమాకు హైలెట్ కాబోతోంది. ప్రధానంగా ఇది స్క్రీన్ ప్లే బేస్డ్ మూవీ కావడంతో కథ రొటీన్ గానే ఉన్నప్పటికీ.. మినిమం గ్యాప్స్ లో వచ్చే ట్విస్టులు అందర్నీ ఎట్రాక్ట్ చేయబోతున్నాయి.

ఇక సాహోలో మరో మేజర్ ఎలిమెంట్, ఆఖరి 30 నిమిషాలు. సినిమాలో ప్రీ-క్లైమాక్స్, క్లయిమాక్స్ సీన్లు నభూతో అనే రేంజ్ లో ఉండబోతున్నాయి. ఈ అర్థగంటలోనే  అసలైన ట్విస్టులన్నీ రివీల్ అవుతాయన్నమాట. దీనికితోడు దుబాయ్ లో తీసిన భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా ఈ ఆఖరి అర్థగంటలోనే ఉంటుంది. అంతేకాదు, సాహోలో చిన్నపాటి ఫాదర్ సెంటిమెంట్ యాంగిల్ కూడా ఉంది.

సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడనే టాక్ ప్రస్తుతం గట్టిగా వినిపిస్తోంది.. అయితే దీన్ని ద్విపాత్రాభినయం అనే కంటే రెండు షేడ్స్ కలిగిన పాత్రలు అనడం కరెక్ట్. ఇలా సాహో సినిమాపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. మరోవైపు ట్రేడ్ పరంగా ఇది తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 120 కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉందంటూ మరో అంచనా కూడా బయటకొచ్చింది.

తరలించరు.. కానీ తగ్గిస్తారు!