సీటీమార్..పూర్ ఇమిటేషన్

బన్నీ ఎవర్ గ్రీన్ డ్యాన్స్ నెంబర్ సీటీమార్. దేవీ చేసిన ట్యూన్, దానికి బన్నీ డ్యాన్స్ మూవ్ మెంట్స్ అన్నీ కలిసి ఆ పాటను ఓ రేంజ్ కు చేర్చాయి. ఇప్పుడు ఆ పాటను…

బన్నీ ఎవర్ గ్రీన్ డ్యాన్స్ నెంబర్ సీటీమార్. దేవీ చేసిన ట్యూన్, దానికి బన్నీ డ్యాన్స్ మూవ్ మెంట్స్ అన్నీ కలిసి ఆ పాటను ఓ రేంజ్ కు చేర్చాయి. ఇప్పుడు ఆ పాటను సల్మాన్ బాలీవుడ్ కు తీసుకెళ్లాడు. 

తన రాధే సినిమాకు వాడుకున్నాడు. అఫీషియల్ గానే అనుకోండి. గతంలో కూడా దేవీ పెప్పీ నెంబర్లు బాలీవుడ్ కు వెళ్లాయి. అదంతా వేరే సంగతి.

అయితే సల్మన్ సీటీమార్ సాంగ్ హడావుడి ఎక్కువ అసలు తక్కువ అన్నట్లు తయారైంది. బన్నీ డ్యాన్స్ చూసిన కళ్లతో సల్మాన్ కదలికలు అస్సలు డైజెస్ట్ కావు. వయసు మీద పడడం, ఫాస్ట్ గా కదలలేకపోవడంతో సీటీ మార్ ట్యూన్ కు సల్మాన్ స్టెప్ లకు సింక్ కుదర లేదు. 

దిశాపటానీ డ్యాన్స్ మూవ్ మెంట్స్ తప్పిస్తే మరేం లేదు. జానీ మాస్టర్ నే కంపోజ్ చేసినా, సల్మాన్ కు, అతని స్టామినాకు తగినట్లు అడ్జస్ట్ కావాల్సి వచ్చినట్లు కనిపిస్తోంది.

ఇదే పాటలో ఆద్యంతం బన్నీ డ్యాన్స్ మూవ్ మెంట్స్ అలరిస్తాయి. కానీ రాధే పాటలో అలాంటి మూవ్ మెంట్ ఒక్కటి కూడా సల్మాన్ చేత చేయించలేకపోయారు.