సినిమా అన్నాక థియేటర్ ట్రయిలర్ అన్నది మస్ట్. ఇది ఎప్పటి నుంచో వస్తున్న పద్దతి. అయితే ఇటీవల సమయం లేకనో, లేక అవసరం లేదనో, మరే కారణం చేతనో థియేటర్ ట్రయిలర్ లేకుండానే నేరుగా సినిమాలు విడుదల చేసిన సందర్భాలు వున్నాయి
మహానటి, గీత గోవిందం సినిమాలు అలాంటివే. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ లే. ఇప్పడు అదే సెంటిమెంట్ నో, లేక అదే పద్దతినో ఫాలో అయిపోతోంది @నర్తనశాల సినిమా.
ఈ సినిమా ప్రరిలీజ్ ఫంక్షన్ ఈ రోజు జరిగింది. అయితే ఈ ఫంక్షన్ లో ట్రయిలర్ విడుదల చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ ట్రయిలర్ ను ఇవ్వకుండా, జస్ట్ వాచ్ ఫుల్ మూవీ ఇన్ థియేటర్స్ అంటూ స్లయిడ్ వేసి సర్ప్రయిజ్ చేసారు.
దీన్ని బట్టి చూస్తుంటే నర్తనశాల సినిమా కూడా ట్రయిలర్ లేకుండానే హిట్ కొట్టాలనే సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే, ట్రయిలర్ కట్ చేయలేనంత హెక్టిక్ షెడ్యూలు అయితే నర్తనశాలకు లేదు. సినిమా వెల్ ప్లాన్డ్ గా ఎప్పడో రెడీ చేసారు. ఫుల్ వెర్షన్ ను సెన్సారుకు రెడీ చేసారు.
అందువల్ల ట్రయిలర్ కట్ చేయాలంటే పెద్ద సమస్య కాదు. కానీ చేయలేదు అంటే హిట్ కొట్టడానికి అవకాశం వుండే ఏ చిన్న రీజన్ ను, సెంటిమెంట్ ను కూడా వదులుకునే ఉద్దేశం లేనట్లు కనిపిస్తోంది.
ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ అయితే, ఇక జనాలు అంతా ట్రయిలర్ మీద అంత శ్రద్ధ పెట్టరేమో?