షాడో కోసం బాలీవుడ్ నటుడు

షాడో వెబ్ సిరీస్ ను ప్రకటించారు నిర్మాత అనిల్ సుంకర. కానీ ప్రకటించినంత సులువు కాదు. షాడో క్యారెక్టర్ కు హీరో దోరకడం. ప్రకటించిన తరువాత ఎవరన్నా ఆసక్తి చూపిస్తారేమో అనుకుని, ముందుగా ప్రకటించారు.…

షాడో వెబ్ సిరీస్ ను ప్రకటించారు నిర్మాత అనిల్ సుంకర. కానీ ప్రకటించినంత సులువు కాదు. షాడో క్యారెక్టర్ కు హీరో దోరకడం. ప్రకటించిన తరువాత ఎవరన్నా ఆసక్తి చూపిస్తారేమో అనుకుని, ముందుగా ప్రకటించారు. కానీ ఎవ్వరూ ఆసక్తి చూపిస్తున్నట్లు లేదు. దాంతో కాస్త లుక్ మంచి ఫిజిక్, కొద్దిగా అయినా పాపులారిటీ వున్న బాలీవుడ్ నటుడి కోసం అన్వేషిస్తున్నారు. 

దీని వల్ల వెబ్ సిరీస్ కు పాన్ ఇండియా లుక్ వస్తుందని ఆశ. కేవలం తెలుగుకు మాత్రమే చేస్తే ఖర్చు కిట్టుబాటు కాదు. అన్ని లాంగ్వేజెస్ కు అయితే కాస్త మంచి బడ్జెట్ డిమాండ్ చేయవచ్చు. ప్రాజెక్టు లాభసాటి అవుతుంది. ఇదిలా వుంటే అసలు వెబ్ సిరీస్ ఎవరికి ఇవ్వాలి అన్నది ఇంకా ఫైనల్ కాలేదని తెలుస్తోంది.

ఈ మేరకు డిస్కషన్లు సాగుతున్నట్లు బోగట్టా. అలాగే వెబ్ సిరీస్ ల్లో అనుభవం వున్న చిన్న డైరక్టర్ ను ఎవరినన్నా తీసుకోవాలా? లేక సినిమాల్లో అనుభవం వున్న చిన్న డైరక్టర్ ను తీసుకుంటే చాలా? అన్నది కూడా చూస్తున్నారు. ఇప్పటికే ఒకటి రెండు ఫ్లాపు సినిమాలు అందించిన ఓ చిన్న డైరక్టర్ పేరు వినిపిస్తోంది. కానీ ఇలాంటి పేర్లతో వెబ్ సిరీస్ కు క్రేజ్ రావడం కష్టం. షాడో పేరు వున్నంత మాత్రాన సరిపోదు అన్ని విధాలా ప్యాకింగ్ గట్టిగా వుండాల్సిందే.

'పీవీ'ని ఆకాశానికి ఎత్తేసిన కెసిఆర్

జగన్ గారిని ఫాలో అవ్వక తప్పదు