నాకు కరోనా లేదు.. నమ్మండి ప్లీజ్

ఇటీవల సినిమా, సీరియళ్ల షూటింగ్ లు మొదలవగానే.. కరోనా వార్తలు కూడా విజృంభించాయి. సహజంగానే పోటీ బాగా ఎక్కువగా ఉన్న పరిశ్రమ. అందులోనూ కరోనా దెబ్బకి యాడ్ రెవెన్యూ లేక విలవిల్లాడుతున్నాయి యాజమాన్యాలు. ఇలాంటి…

ఇటీవల సినిమా, సీరియళ్ల షూటింగ్ లు మొదలవగానే.. కరోనా వార్తలు కూడా విజృంభించాయి. సహజంగానే పోటీ బాగా ఎక్కువగా ఉన్న పరిశ్రమ. అందులోనూ కరోనా దెబ్బకి యాడ్ రెవెన్యూ లేక విలవిల్లాడుతున్నాయి యాజమాన్యాలు. ఇలాంటి టైమ్ లో కొద్దో గొప్పో జాగ్రత్తలతో షూటింగ్ లు మొదలుపెట్టారు. అయితే ఒకరిని పడగొట్టడానికి ఇంకొకరు నీఛానికి దిగజారుతున్నారు. ఫలానా సీరియల్ ఆర్టిస్టుకు కరోనా వచ్చిందంటూ అసత్య ప్రచారం ప్రారంభిస్తున్నారు.

న్యూస్ ఛానెల్స్ మాత్రం తేలుకుట్టిన దొంగల్లా.. నిజాల్ని దాచిపెడుతున్నాయి కానీ, ఎంటర్టైన్ మెంట్ ఛానెళ్లు మాత్రం పరోక్షంగా దుష్ప్రచారానికి తెరతీస్తున్నాయి. “ఫలానా టీవీ సీరియల్ షూటింగ్ లో అసలు జాగ్రత్తలే తీసుకోవడంలేదట”, “ఆ సీరియల్ నటుడికి కరోనా పాజిటివ్ అట”, “ఫలానా ఛానెల్ లో ప్రోగ్రామ్ చేసే ప్రముఖ యాంకర్ కి కరోనా వచ్చిందట”.. ఇవీ ఇప్పుడు చక్కర్లు కొడుతున్న సోషల్ మీడియా వార్తలు.

అయితే వీటిలో అన్నీ వాస్తవాలు కాదు. తాజాగా దర్శకుడు ఓంకార్ కి కరోనా వచ్చిందని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. వైరిపక్షం ఓంకార్ ప్రోగ్రామ్ లను దెబ్బకొట్టడానికి, ఛానెల్ రేటింగ్ లు పడిపోయేలా చేయడానికే ఈ అసత్య ప్రచారం స్టార్ట్ చేసింది.. ఓంకార్ కి కరోనా వచ్చిందన్న వార్తలు బాగా సర్కులేట్ అవడంతో.. స్వయంగా కుటుంబ సభ్యులు స్పందించాల్సి వచ్చింది. ఆయనకు కరోనా లేదని, పరీక్ష చేయించుకుంటే నెగెటివ్ అని రిపోర్ట్ వచ్చిందని, అందుకే షూటింగ్ లకు వెళ్తున్నారని చెప్పారు. మరి ఓంకార్ కి కరోనా అని ప్రచారం చేసింది ఎవరు అని ఆరాతీస్తే.. ఆయన చేసే ప్రోగ్రామ్ తో పోటీపడి ఇబ్బంది పడినవారని తేలింది.

ఇదొక్కటే కాదు.. ఇలాంటి ఉదాహరణలు చాలానే ఉన్నాయి. తమకు పోటీ అనుకున్న నటీనటులకి కరోనా వచ్చిందని పలు సీరియళ్ల ప్రొడక్షన్ సంస్థలు  తప్పుడు ప్రచారం చేస్తున్నారు. యూట్యూబ్ ఛానెళ్ల వారికి చెప్పి మరీ స్టోరీలు వేయిస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తే నిజమని అనుకోం గానీ, కనీసం అనుమానం వస్తుంది కదా, ఇవే వార్తలు ఆయా నటీనటులు చూస్తే వారు మానసికంగా ఇబ్బంది పడతారు కదా. అలా వారిని మానసికంగా హింసించడానికే ఈ తప్పుడు ప్రచారం.

మొత్తమ్మీద… సెలబ్రిటీలంతా తమకి కరోనా లేదని సర్టిఫికెట్ జేబులో పెట్టుకుని తిరగాల్సిన రోజులొచ్చాయి. 

జగన్ గారిని ఫాలో అవ్వక తప్పదు

'పీవీ'ని ఆకాశానికి ఎత్తేసిన కెసిఆర్