విస్తరణ అంటూ జరిగితే ఉత్తరాంధ్రా జిల్లాల నుంచి ఇద్దరు మంత్రులు అవుట్ అవుతారని రాజకీయ వర్గాల్లో వేడిగా చర్చ సాగుతోంది. అలాగే ఓ బీసీ నేతకు ఉప ముఖ్యమంత్రి పదవి కూడా దక్కి ప్రమోషన్ వస్తుందని టాక్ నడుస్తోంది.
మంత్రుల ఏడాది పాలనపైన వైసీపీ ప్రభుత్వ పెద్దలు నివేదికలు తెప్పించుకున్నారని, అందులో పనితీరు బాగాలేని వారిలో ఉత్తరాంధ్రా నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.
ఆ ఇద్దరికీ ఉద్వాసన ఖాయమని కూడా అంటున్నారు. మరి ఈ నివేదికలోని సారాశం తెలిసిందో. లేక తమ పనితీరు మీద వారికే అంచనాలు ఉన్నాయో తెలియదు కానీ ఉత్తారాంధ్రా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నలుగురు మంత్రులలో ఇద్దరు సైలెంట్ మోడ్ లోని వెళ్ళిపోయారు.
నిజానికి పవన్ మీద గట్టిగా విమర్శలు ఒక మంత్రి గారు ఇపుడు మౌనమే నా భాష అనడం వెనక పదవీ వియోగం బాధ ఉందా అన్న చర్చ సాగుతోంది. కాపుల రిజర్వేషన్ మీద పవన్ బాణాలు వేస్తున్నా ఆ మంత్రి గారు ఇంతవరకూ కిమ్మనకపోవడాన్ని బట్టి ఆయనకు పదవీ గండం ఏమైనా పొంచి ఉందా అన్న టాక్ నడుస్తోంది.
మొత్తానికి చూస్తే ఉత్తరాంధ్రాకు ఇపుడున్న నలుగురులో ఇద్దరు అవుట్ అయితే మరో ముగ్గురు కొత్తగా వస్తారని కూడా ప్రచారం సాగుతోంది. ఆ వచ్చేవారు ఎవరు, ఈ పోయేవారు ఎవరు అన్నదే హాట్ టాపిక్ ఇపుడు.