హీరోయిన్ గా తాప్సీ కెరీర్ ప్రారంభమై ఇప్పటికే పదేళ్లు గడిచిపోయినట్టుగా ఉన్నాయి. ప్రత్యేకించి గత ఐదారేళ్లుగా తాప్సీ గ్లామరస్ రోల్స్ తో కన్నా.. నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతోనే నెట్టుకొస్తోంది. మరీ బీభత్సమైన నటి ఏమీ కాకపోయినా, డిఫరెంట్ సినిమాలు దొరకడం తాప్సీకి అడ్వాంటేజ్ గా మారింది. పింక్, బద్లా, గేమ్ ఓవర్.. వంటి వైవిధ్యభరిత సినిమాలతో తాప్సీ ఉనికి చాటుకుంటూ ఉంది.
ఇదే సమయంలో తాప్సీ చెల్లెలు ఉనికి చాటుతూ ఉంది. తన పేరు షగున్. తాప్సీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా షగున్ ఇంటర్నెట్ కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ఈమె సోషల్ మీడియాలో తన కంటూ ప్రత్యేక ఫాలోయింగ్ ను సృష్టించుకుంటూ ఉంది. ఈమెకూ ఫాలోయర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉంది.
ఇక ఇదే సమయంలో బాలీవుడ్ మీడియా కూడా షగున్ మీద కన్నేసింది. ఈమె చాలా క్యూట్ గా ఉంది, హాట్ గా ఉందంటూ అక్కడి మీడియా షగున్ ను వర్ణిస్తూ ఉంది. మరి ఎవరైనా మూవీ మేకర్ల దృష్టి కూడా షగున్ మీద పడితే ఆమె హీరోయిన్ అయిపోవడం కష్టం కాదేమో. ఇది వరకూ బోలెడంత మంది హీరోయిన్లు తమకు గుర్తింపు వచ్చాకా, తమ చెల్లెళ్లను హీరోయిన్లుగా పరిచయం చేశారు. అయితే ఇండస్ట్రీలో నెపొటిజం మీద ఇప్పటికీ తాప్సీ దుమ్మెత్తి పోస్తూ ఉంది. ఇలాంటి క్రమంలో తన చెల్లెలు హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తే తాప్సీ అప్పుడు తనే కార్నర్ అయ్యే అవకాశాలు లేకపోలేదు!