అసలు ఫర్హాన్ అక్తర్ ఇంకా విడాకులు తీసుకోలేదు. 15 యేళ్ల పాటు కాపురం చేసిన భార్యకు అతడు దూరంగా ఉంటున్నాడంతే. విడాకులైతే తీసుకోలేదు. అతడికి ఇద్దరు పిల్లలు కూడా. ఇంకా లోతుల్లోకి వెళితే.. భార్యను ఇంటి నుంచి వెల్లగొట్టాకా.. అతడు వేరే నటీమణులతో కూడా సాన్నిహిత్యాన్ని ఏర్పరుచుకున్నాడు. అదితీరావ్ హైదరీ వంటి నటీమణితో కొంత కాలం టైంపాస్ చేశాడు. ఆ తర్వాత ఆమెకు కూడా దూరం అయ్యాడు!
మరి అంత ఘన చరిత్ర కలిగిన ఫర్హాన్ అక్తర్ లో ఆమెకు ఏం నచ్చిందో కానీ.. ఏకంగా అతడితో సహజీవనం చేస్తోంది. వయసు రీత్యా కానీ, అందం రీత్యా కానీ.. శ్రద్ధాకపూర్ రేంజ్ కు ఫర్హాన్ లాంటి వాడి కన్నా ఫ్రెష్షర్ ప్రేమికుడిగా లేదా భర్తగా లభిస్తాడు… ఈ మాట ఎవరైనా చెప్పగలరు. మరి బయటి వారే ఇలా చెబుతుంటే.. శ్రద్ధ విషయంలో ఆమె పేరెంట్స్ ఆవేదన ఏ స్థాయిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
చాలా మంది బాలీవుడ్ హీరోయిన్ల వలె.. పెళ్లైన, వయసులో తన సరిజోడు కాని వ్యక్తినే జోడీగా ఎంపిక చేసుకుంది శ్రద్ధా. మిగతా వాళ్లంతా కనీసం మొదటి భార్యలకు విడాకులు ఇచ్చారు. కానీ.. ఫర్హాన్ లీగల్ గా తన మొదటి భార్య నుంచి వేరుపడలేదు. అలాంటి వాడితో సహజీవనం చేస్తున్న శ్రద్ధను ఇటీవల ఆమె తండ్రి, బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కలిశాడట. ఫర్హాన్ తో ఆమె కాపురం చేస్తున్న ఇంటికి వెళ్లాడట శక్తి కపూర్. ఆయనతో పాటు వారి సమీప బంధువులు కూడా వెళ్లారట.
ఈ సహజీవనాన్ని చాలించి.. ఇంటికి వచ్చేయమని వీరు ఆమెను గద్దించి, సూచించి, అర్థించి వచ్చారని సమాచారం. ఫర్హాన్ తో శ్రద్ధ రిలేషన్ ను ఏ మాత్రం ఇష్టపడటం లేదు శక్తి కపూర్ కుటుంబ సభ్యులు. అయితే.. శ్రద్ధ మాత్రం ఇప్పటి వరకూ పేరెంట్స్ ను లెక్కచేసినట్టుగా కనిపించడం లేదు! మరి ఇకపై ఏం జరుగుతుందో.