షారుక్‌ఖాన్‌కి ఏమైంది.?

బాలీవుడ్‌ హీరో షారుక్‌ఖాన్‌ షూటింగ్‌ సమయంలో గాయపడ్డాడన్న వార్తతో అభిమానులంతా ఆందోళన చెందుతున్నారు. ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ అనే సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలోనే ప్రమాదశాత్తూ షారుక్‌ఖాన్‌ గాయపడ్డట్లు తెలుస్తోంది. Advertisement ఇక, ఈ…

బాలీవుడ్‌ హీరో షారుక్‌ఖాన్‌ షూటింగ్‌ సమయంలో గాయపడ్డాడన్న వార్తతో అభిమానులంతా ఆందోళన చెందుతున్నారు. ‘హ్యాపీ న్యూ ఇయర్‌’ అనే సినిమా షూటింగ్‌లో పాల్గొంటున్న సమయంలోనే ప్రమాదశాత్తూ షారుక్‌ఖాన్‌ గాయపడ్డట్లు తెలుస్తోంది.

ఇక, ఈ విషయం బాలీవుడ్‌ సినీ ట్రేడ్‌ అనలిస్ట్‌ తరణ్‌ ఆదర్శ్‌ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించేసరికి, అభిమానుల్లో ఆందోళన నెలకొంది. వారి ఆందోళనను తగ్గించేందుకు షారుక్‌ఖాన్‌, తన కార్యాలయం నుంచి అభిమానులకు తన క్షేమ సమాచారాన్ని పంపాడు. చిన్నపాటి గాయాలు షూటింగ్‌ సమయంలో తగిలిన మాట వాస్తవమే అనీ, ప్రస్తుతం తాను క్షేమంగా వున్నాననీ ఆ ప్రకటనలో షారుక్‌ తెలియజేశాడు.

అయితే షారుక్‌ పరిస్థితి ఎలా వుందన్నదానిపై అభిమానుల్లో ఆందోళన ఇంకా తగ్గలేదు. పెద్ద సంఖ్యలో అభిమానులు షారుక్‌ ఇంటివద్దకు చేరుకుంటున్నారు.