బ్యానర్ అదే.. హీరో మాత్రం మారిపోయాడు..!

బ్రహ్మోత్సవం సినిమాతో డబుల్ డిజాస్టర్ అందుకున్న శ్రీకాంత్ అడ్డాల, నెక్ట్స్ సినిమా కోసం అష్టకష్టాలు పడుతున్నాడు. ఇందులో భాగంగా గీతాఆర్ట్స్ బ్యానర్ పై అడ్డాల అప్ కమింగ్ మూవీ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే.…

బ్రహ్మోత్సవం సినిమాతో డబుల్ డిజాస్టర్ అందుకున్న శ్రీకాంత్ అడ్డాల, నెక్ట్స్ సినిమా కోసం అష్టకష్టాలు పడుతున్నాడు. ఇందులో భాగంగా గీతాఆర్ట్స్ బ్యానర్ పై అడ్డాల అప్ కమింగ్ మూవీ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. కుదిరితే అల్లుశిరీష్ తో ఆ ప్రాజెక్టు సెట్స్ పైకి వచ్చే ఛాన్స్ ఉందంటూ కథనాలు కూడా వచ్చాయి ఆమధ్య. అయితే ఇప్పుడీ ప్రాజెక్టులో హీరో మారాడు.

అవును.. శ్రీకాంత్ అడ్డాల రాసుకున్న కథలో హీరో అల్లుశిరీష్ కాదు. అన్నీ అనుకున్నట్టు జరిగితే శర్వానంద్ ఈ సినిమాలో హీరోగా నటించే ఛాన్స్ ఉంది. నిర్మాత మాత్రం అల్లు అరవిందే ఉంటారు. గీతాఆర్ట్స్-2 బ్యానర్ పై ఈ సినిమా వస్తుంది.

శతమానం భవతి సినిమాతో ఫ్యామిలీ కథలకు కూడా సూట్ అవుతానని ప్రూవ్ చేసుకున్నాడు శర్వానంద్. ఆ మూవీ తర్వాత మరోసారి అలాంటి కథలో నటించడానికి ఆసక్తి చూపించినప్పటికీ మంచి స్టోరీలు దొరకలేదు. ఎట్టకేలకు శ్రీకాంత్ అడ్డాల చెప్పిన కథ శర్వానంద్ కు నచ్చిందట.

సుధీర్ వర్మతో చేయాల్సిన సినిమా కంప్లీట్ అయిన వెంటనే అడ్డాల సినిమాపై క్లారిటీ వస్తుంది. అంతా బాగానే ఉంది కానీ, శర్వానంద్ కు నచ్చిన అడ్డాల కథ అల్లుశిరీష్ కు ఎందుకు నచ్చలేదబ్బా..?