సిక్సు ప్యాక్ లు కష్టపడి చేసిన తరువాత తగు సమయంలో ఆ సిక్స్ ప్యాక్ బాడీని స్క్రీన్ మీద చూపించకపోతే ఎలా? అందుకే హీరోలు అప్పుడప్పుడు స్క్రీన్ మీద షర్ట్ తీసి కనిపిస్తుంటారు. సునీల్ దగ్గర నుంచి ఎన్టీఆర్ వరకు ఎవ్వరూ మినహాయింపు కాదు.
హీరో సుధీర్ బాబుకు ఫిట్ నెస్ మీద శ్రద్ద ఎక్కువ. ఇద్దరు పిల్లల తండ్రి అయినా, నలభై ఏళ్ల మిడిల్ ఏజ్డ్ లోకి వచ్చినా, ఫుల్ ఫిట్ తో వుంటారు. ఇప్పటికీ ఇంకా సిక్స్ ప్యాక్ మెయింటెయిన్ చేస్తున్నారు. లేటెస్ట్ గా సుధీర్ బాబు వి సినిమాలో పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తున్నారు. హీరో నానితో పోటాపోటీగా చేయడమే కాదు, ఆ సినిమాలో భారీ ఫైట్లు కూడా చేసేసారు.
దాంతో పాటు పనిలో పనిగా ఓ ఫైట్ లో షర్ట్ విప్పి తన ఫిట్ ఫిజిక్ ను, టాప్ లెస్ గా చూపించినట్లు తెలుస్తోంది. సమ్మోహనం సినిమాతో సుధీర్ బాబుకు మంచి సినిమా అందించారు దర్శకుడు ఇంద్రగంటి. మళ్లీ వి సినిమాలో కీలకమైన, హీరోతో సమానమైన పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయిస్తున్నారు. త్వరలో విడుదల కాబోతున్న ట్రయిలర్ లో నాని కన్నా సుధీర్ బాబుకే ఎక్కువ లెంగ్త్ వున్నట్లు తెలుస్తోంది.