Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

షాకింగ్..పవన్-సుజిత్ సినిమా రెమ్యూనిరేషన్లు

షాకింగ్..పవన్-సుజిత్ సినిమా రెమ్యూనిరేషన్లు

ఇప్పటి వరకు తెలుగులో హయ్యస్ట్ రెమ్యూనిరేషన్లు అంటే ప్రభాస్..ఆ తరువాత బన్నీ..లేటెస్ట్ గా రామ్ చరణ్, ఎన్టీఆర్ పేర్లు వినిపిస్తున్నాయి. మెగాస్టార్ యాభై కోట్లు తీసుకుంటున్నారని టాక్ వుంది. 

పవన్ కళ్యాణ్ కూడా అదే రేంజ్ అని వినిపిస్తూ వచ్చింది. కానీ లేటెస్ట్ గా పవన్ ఓకె చేసిన డివివి దానయ్య నిర్మించే, సుజిత్ డైరక్షన్ సినిమాకు చాలా అంటే చాలా భారీ రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నారని టాలీవుడ్ ఇన్ సైడ్ వర్గాల్లో వినిపిస్తోంది.

సుజిత్-దానయ్య సినిమాకు పవన్ ఏకంగా 75 కోట్ల రెమ్యూనిరేషన్, లాభాల్లో మూడో వంతు వాటా తీసుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. అలాగే ఒక వంతు రెమ్యూనిరేషన్ ప్రాజెక్ట్ సెట్ చేసిన త్రివిక్రమ్ కు ఇస్తారని భోగట్టా. మిగిలిన ఒక వంతు నిర్మాత దానయ్యకు. సినిమా నిర్మాణానికి పవన్ రెమ్యూనిరేషన్ లతో కలిపి 175 వరకు అవుతుందని తెలుస్తోంది.

ఈ లెక్కన నిర్మాత దానయ్యకు ఓ పది కోట్లు మిగలాలి అన్నా సినిమా మొత్తం 200 కోట్లు పైగా మార్కెట్ చేయాల్సి వుంటుంది. నాన్ థియేటర్ మీద 100 కోట్ల మేరకు రావాల్సి వుంటుంది.

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా