ఆరు లక్షల నిర్మాణం, మహా అయితే మరో ఆరులక్షల ప్రకటనలతో సినిమా తీసి, శ్రేయాస్ ఇటి ఆన్ లైన్ థియేటర్ లో సినిమాను విడుదల చేసి జాక్ పాట్ కొట్టారు ఆర్జీవీ. రెండు వందల టికెట్ వంతను 35వేల మంది వరకు ఈసినిమా చూసారని ఆన్ లైన్ థియేటర్ కాన్సెప్ట్ క్రియేటర్స్ అయిన శ్రేయాస్ ఇటి సంస్థ చెబుతోంది.
ఈ సినిమాకు కీలకం అందులో నటించిన శ్రీ రాపాక అలియాస్ స్వీటీ. ఈ అమ్మడి సంగతులు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమాలో అవకాశం హరీష్ అనే డైరక్టర్ అసోసియేట్ ద్వారా వచ్చిందట. వర్మ దాదాపు అరడజను మందికి పైగానే అమ్మాయిలను చూసిన తరువాత ఈమెను ఓకె చేసారట.
అడిషన్ కు మామూలుగానే చీరకట్టుకుని, ఇదే హెయిర్ స్టయిల్ తో వెళ్లిందట. వెళ్లగానే హైట్ ఎంత అని అడిగారట ఆర్జీవీ. 5.6 అని బదులు చెప్పగానే ఓకె అన్నారట. ట్రాడిషనల్ గా వుంటూనే హాట్ గా వుండేలా సినిమా వుంటుందని, అలాగే వుండాలని చెప్పారట. అంతే..సెలెక్ట్ అయిన తరువాత జస్ట్ రెండు రోజులు మాత్రమే షూట్ చేసారట. మొదటి రోజు మామూలుగా తీసి, రెండో రోజు మాత్రం ఎదమీద, తొడల మీద కేమేరా ఫోకస్ చేసారట. షార్ట్ వేసుకుని దానిపై ఇన్నర్ వేర్ వేయించి, అది విప్పినట్లు చూపించి, మ్యాజిక్ చేసారట ఆర్జీవీ.
ఇంతకీ రెమ్యూనిరేషన్ ఎంత అంటే రెండు లక్షలే అంటోంది. తాను అంతే అడిగింది అంట..ఇచ్చేమన్నారట ఆర్జీవీ. కానీ బయట మాత్రం లాభంలో కొంత వాటా ఇచ్చారు అని టాక్ వినిపిస్తోంది. వెస్ట్ గోదావరి కి చెందిన శ్రీ రాపాక ఇప్పటికే ఇండస్ట్రీకి పరిచయమేనంట. చిన్న నటిగా, కాస్ట్యూమ్ డిజైనర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఆమె ఇప్పుడు సినమా రంగం దృష్టిలో పూర్తిగా పడింది.