‘సిల్లీ’ పోస్టర్

ఇద్దరు ఫ్లాప్ లైన్ లో వున్న హీరోలు అల్లరి నరేష్, సునీల్. ఈ ఇద్దరితో దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు చేస్తున్న సినిమా సిల్లీ ఫెలోస్. ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కాబోతోంది. ఈ…

ఇద్దరు ఫ్లాప్ లైన్ లో వున్న హీరోలు అల్లరి నరేష్, సునీల్. ఈ ఇద్దరితో దర్శకుడు భీమినేని శ్రీనివాసరావు చేస్తున్న సినిమా సిల్లీ ఫెలోస్. ఈ సినిమా సెప్టెంబర్ 7న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా మోషన్ పోస్టర్ వదిలారు. దీంట్లో స్పెషాలిటీ ఏమిటంటే, ఫస్ట్ టైమ్ మోషన్ పోస్టర్ కు డైలాగ్ యాడ్ చేయడం. అల్లరి నరేష్ స్పీడ్ గా బైక్ నడుపుతుంటే, దాన్ని పట్టుకుని సునీల్ వేలాడే కాన్సెప్ట్ తో ఈ పోస్టర్ రూపొందించారు. గతంలో చిరంజీవి సినిమాలో ఓసారి సునీల్ ఈ టైప్ ఫీట్ చేసాడు.

ఇంతకీ దీనికి యాడ్ చేసిన డైలాగు ఏమిటంటే..’’.. ఈ స్పీడుతో వెళ్లిపోతే గంటలో శ్రీశైలం వెళ్లిపోతాం కదా’ అని నరేష్ అంటే, శ్రీశైలం ఏం ఖర్మ, అరగంటలో కైలాసం వెళ్లిపోతాం అంటాడు. ఇక్కడే కాస్త పాతవాసన కొడుతూంది దర్శకుడు భీమినేని ఇంకా కాస్త వెనక్కు వుండిపోయినట్లుంది. వాట్సాప్ ల్లో ఎప్పటికప్పుడు ఇంతకన్నా సూపర్ జోక్ లు ఫార్వార్డ్ అవుతున్నాయి.

జనాలు ఈ జోక్ లు అన్నీ చూసి ముదిరిపోయారు. వాళ్లకు ఇలాంటివి ఆనవు. ఎటొచ్చీ సునీల్ యాక్సెంట్, నరేష్ స్టయిల్ యాడ్ అయితే తేడా వుండి ఫన్ పండొచ్చేమో? సిల్లీ ఫెలోస్ టీజర్, ట్రయిలర్ రావాల్సి వుంది. అవివస్తే కానీ, ఈ సినిమాలో అయినా ఆ ఇద్దరూ కామెడీ కొత్తగా ట్రయ్ చేసారో లేదో తెలుస్తుంది.