శింబు, త్రిష.. వీళ్లు ఇప్పటి వాళ్లు కాదు.. ఎప్పుడో టీనేజ్ లోనే కలిసి నటించిన వాళ్లు. దశాబ్దంన్నర కిందటే వీళ్ల కాంబినేషన్లో సినిమా వచ్చినట్టుంది. శింబు కుర్రాడిగా ఉన్నప్పుడు, త్రిష ఇంకా టీనేజ్ గర్ల్ అయిన సమయంలో వీరి కాంబోలో ఒక సినిమా వచ్చింది. ఆ తర్వాత కొన్నేళ్లకు గౌతమ్ మీనన్ సినిమాలో ఈ జంట కనిపించింది. ఏం మాయ చేశావే తమిళ వెర్షన్లో వీరు జంటగా నటించారు. అవే రోల్స్ లో తెలుగులో నటించిన నాగచైతన్య, సమంత ముందు శింబు-త్రిషలు తేలిపోయారు. ఈ జంటలో అప్పటికే ప్రేమకథకు తగిన ఫ్రెష్ నెస్ లేకపోయింది!
ఇప్పుడు తమిళ మీడియాలో ఒక పుకారు షికారు చేస్తోంది. అదేమిటంటే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనేది. గతంలో వీళ్లకు వేర్వేరు ప్రేమ ట్రాకులున్నాయి. త్రిష ఒకరితో ఎంగేజ్ మెంట్ వరకూ వెళ్లి , పెళ్లి ముందు రద్దు చేసుకుంది. నయనతారతో శింబు ప్రేమ కథ, ఆ తర్వాత హన్సిక తనను ఒంటరి చేసి వెళ్లిపోయిందని అతడు వాపోవడం ఇవన్నీ శింబు ప్రేమకథలు.
ఈ క్రమంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే పుకారు షికారు చేస్తూ ఉంది. ఇలాంటి చిత్రమైన పుకార్లను పుట్టించడంలో తమిళ మీడియాది అందె వేసిన చేయి. పెళ్లి విషయంలో పెద్దగా ఆసక్తి కనబరచకుండా ఉండే ముదురు హీరోయిన్ల విషయంలో అయితే తమిళ మీడియా చిత్రవిచిత్రమైన పుకార్లను పుట్టిస్తుంటుంది. గతంలో నమితను శరత్ బాబు పెళ్లి చేసుకోబోతున్నాడని, అనుష్కను నాగ చైతన్య పెళ్లి చేసుకుంటాడంటూ.. రకరకాల చిత్రమైన కథనాలను తమిళ మీడియా పుట్టించింది. అదే తరహాలో శింబు-త్రిష పెళ్లి వార్త కనిపిస్తుంది.
ఈ ప్రచారం పై త్రిష, శింబుల సన్నిహిత వర్గాలు స్పందించాయి ఇప్పటికే. అదంతా ఉత్తుత్తి ప్రచారమే అని, అవన్నీ రూమర్లే అని వాళ్లు తేల్చి చెప్పారు!