పెద్ద సినిమాల వ్యవహారంతో చిన్న, మీడియం సినిమాల నిర్మాతలు చిక్కుల్లో పడుతున్నారు. అన్నీ చూసుకుని ఓ డేట్ అనుకుంటే, ఎక్కడి నుంచో వచ్చి ఆ డేట్ మీద ఓ పెద్ద సినిమా పడుతుంది. దాంతో మళ్లీ డేట్లు వెదుక్కోవాలి. సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఎప్పడో పూర్తయిపోయింది. సరైన డేట్ కోసం చూస్తోంది.
ఎక్కడకు వెళ్తే, అక్కడకు ఓ పెద్ద సినిమా వచ్చి పడుతోంది. కానీ ఈసారి ఆరు నూరైనా 23న విడుదల చేయాల్సిందే అని హీరో సప్తగిరి డిసైడ్ అయిపోయాడు. 9 ధృవ, 16న సింగం 3 వుందని సప్తగిరి 23న రావాలని ఫిక్సయ్యాడు. కానీ ఇప్పుడు ధృవ-సింగం 3 కూడబలుక్కుని వారం గ్యాప్ సెట్ చేసుకున్నాయి. దీంతో సింగం 3 వారం వెనక్కు వెళ్లింది.
అయినా కూడా సప్తగిరి ఎక్స్ ప్రెస్ మాత్రం ఈసారి డేట్ మార్చుకోలేదు. తన సినిమా కంటెంట్ మీద పూర్తి నమ్మకం వుందని, ఒకసారి జనంలోకి కంటెంట్ వెళ్లిన తరువాత వాళ్లకి నచ్చితే, వాళ్లే ఆదరిస్తారని, నచ్చకుంటే సో లో గా వచ్చినా ఫలితం వుండదని, అందుకే 23న రావాలని ఫిక్సయినట్లు సప్తగిరి అంటున్నాడట. అయినా 23 నుంచి పొంగల్ వరకు దాదాపు సినిమాలు లేనట్లే. అందువల్ల రెండు సినిమాలు వున్నా పెద్ద సమస్య ఏమీ వుండదు.